లిండే ఇండియా ఎఫెక్ట్‌-వాహ్‌.. వా టెక్‌!

లిండే ఇండియా ఎఫెక్ట్‌-వాహ్‌.. వా టెక్‌!

విదేశీ ప్రమోటర్‌ లిండే ఇండియాను స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్‌ చేసే ప్రణాళికలు ప్రకటించడంతో ఈ కౌంటర్ ఒక్కసారిగా జోరందుకుంది. దేశీ అనుబంధ సంస్థ లిండే ఇండియాలో గ్లోబల్‌ దిగ్గజం బీవోసీ గ్రూప్‌నకు 75 శాతం వాటా ఉంది. ఈ నెల 15 నుంచి 21 వరకూ ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా వాటాదారుల నుంచి మిగిలిన వాటాను ప్రమోటర్‌ కంపెనీ కొనుగోలు చేయనున్నట్లు లిండే ఇండియా పేర్కొంది. ఇందుకు షేరుకి రూ. 328.21 ధరను చెల్లించనుంది. ఈ నేపథ్యంలో లిండే ఇండియా కౌంటర్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లి రూ. 754 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 775 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ట్రేడింగ్‌ పరిమాణం సైతం 10 రెట్లు ఎగసింది. ఇప్పటివరకూ 8.5 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీలో రిలయన్స్‌ ఎంఎఫ్‌కు 9.84 శాతం వాటా ఉంది. కాగా.. డీలిస్టింగ్‌ వార్తలతో నవంబర్‌ 7 నుంచి ఈ షేరు 56 శాతం ర్యాలీ చేయడం విశేషం!

Image result for va tech wabag

వా టెక్‌ వాబాగ్‌
గ్లోబల్‌ దిగ్గజం బీవోసీ గ్రూప్‌ దేశీ అనుబంధ సంస్థ లిండే ఇండియాను డీలిస్ట్‌ చేయనున్న వార్తలతో వా టెక్‌ వాబాగ్‌ కౌంటర్‌కూ భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వా టెక్‌ వాబాగ్‌ షేరు 14 శాతంపైగా దూసుకెళ్లి రూ. 319 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 324 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని, రూ. 277 వద్ద కనిష్టాన్నీ తాకింది. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల దిగ్గజం వా టెక్‌ వాబాగ్‌ కౌంటర్లో ఇప్పటివరకూ ఐదు రెట్లకుపైగా లావాదేవీలు జరిగాయి. గత 20 రోజుల సగటు 41,000తో పోలిస్తే ట్రేడింగ్‌ పరిమాణం 4.3 లక్షలను తాకడం విశేషం! 

ర్యాలీ బాటలో
ఎమ్‌ఎన్‌సీ కంపెనీ వా టెక్ షేరు గత ఐదు రోజుల్లో 27 శాతం ర్యాలీ చేసింది. కాగా.. నార్వే ప్రభుత్వ సంస్థ నార్జెస్‌ బ్యాంక్‌ తాజాగా కంపెనీలో 3.31 లక్షల షేర్లకుపైగా కొనుగోలు చేసింది. షేరుకి రూ. 259.53 ధరలో 0.61 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. ఇంతక్రితం డిసెంబర్‌ 21న సైతం నార్జెస్‌ బ్యాంక్‌ 1.65 శాతం వాటాకు సమానమైన 9 లక్షల వా టెక్‌ షేర్లను కొనుగోలు చేసిన విషయం విదితమే. షేరుకి రూ. 270 ధరలో వీటిని సొంతం చేసుకుంది.Most Popular