2019లో ఇవి బెస్ట్ అంటున్న ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ!!

2019లో ఇవి బెస్ట్ అంటున్న ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ!!

2018 దేశీయ మార్కెట్లకు ఏ మాత్రం కలిసిరాలేదు. మరి ఈ సంవత్సరం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి. అమెరికా చైనా ట్రేడ్ వార్ ఒక వైపు, దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు మరో వైపు మార్కెట్లను వెనక్కి లాగనున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మదుపర్లు ఏ స్టాక్స్‌ను ఎంచుకోవాలి? ఎలాంటి రంగాల్లో పెట్టుబడులు సురక్షితం అనేదానిపై దేశంలోని నాలుగో అతిపెద్ద పోర్ట్ ఫోలియో మేనేజర్ ఆస్క్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ సంస్థ కొన్ని సూచనలను చేస్తుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ల స్థితి గతుల కారణంగా రానున్న నెలల్లో వినియోగదారుల ఆధారిత స్టాక్స్ (కన్జంప్షన్ డ్రివెన్ స్టాక్స్ ) మీద పెట్టుబడులు విజయవంతం అవుతాయని ఆస్క్ పేర్కొంది. 
దేశంలోనే 4వ అతిపెద్ద పోర్ట్ ఫోలియో మేనేజర్ అయిన ఆస్క్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అసెట్స్ విలువ రూ. 12,610.6 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ అంచనా ప్రకారం కన్జంప్షన్ బిజినెస్, కన్జ్యూమర్ ఫైనాన్షియర్ స్టాక్స్ 2019లో ప్రభావం చూపనున్నాయని, వాటి మీద పెట్టుబడులు లాభాలను ఆర్జిస్తాయని అంచనా వేస్తుంది. ఈ రంగాలు భవిష్యత్తు మార్కెట్ల స్పందనను అధిగమించి మరీ ప్రాఫిట్ ఎర్నింగ్స్ తీసుకువస్తాయని ఆస్క్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ లిమిటెడ్ భావిస్తుంది. ఈ సంస్థ మార్కెట్ పై వెల్లడించిన అభిప్రాయాలు మరికొన్ని... 
* గ్లోబల్ వృద్ధి గత సంవత్సరం కంటే నెమ్మదిస్తుంది. US, చైనా వంటి ఆర్ధిక వ్యవస్థల్లో కూడా ఆర్ధిక వృద్ధి నెమ్మదించవచ్చు. 
* పెద్ద పరిశ్రమలు స్ట్రెస్‌డ్ ఎసెట్స్ మీద పెట్టుబడులు పెట్టడం,  ప్రభుత్వం రుణమాఫీలు చేయడం వంటి వాటి వల్ల  క్యాపిటలైజేషన్ వ్యయాల ( క్యాపెక్స్) మీద  ప్రభావం చూపనుంది. 
* కంపెనీల సామర్ధ్య వినియోగం పెరుగుతుంది.
* క్యాపెక్స్ మీద ఇండియన్ కార్పోరేట్ కంపెనీలు ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవచ్చు.
* ఆటోమోబైల్స్ రంగం డిసెంబర్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. ఇది కొనసాగితే కనుక ఆటో రంగం కోలుకోడానికి చాలా సమయం తీసుకోవచ్చు. 
* రియాల్టీ రంగం ఈ సంవత్సరం అసెట్ మేనేజర్స్ ఛాయిస్ కాబోదు. 
మహీంద్ర&మహీంద్ర,  ITC, DB కార్ప్, HDFC, ఇమామీ, GSK కన్జ్యూమర్, క్రాంప్టన్ కన్జ్యూమర్, ICICI ప్రుడెన్షియల్ వంటి  కన్జ్యూమర్స్ , మరియు కన్జ్యూమర్స్ ఫైనాన్షియర్స్ స్టాక్స్ 2019లో మంచి పనితీరును కనబరచనున్నాయని ఆస్క్ సంస్థ పేర్కొంటుంది. 

Disclaimer: పైన పేర్కొన్న అభిప్రాయాలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ వెలుబుచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక ముందు మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి. 
 Most Popular