క్యూ3- బంధన్‌ బ్యాంక్‌- గోవా కార్బన్‌

క్యూ3- బంధన్‌ బ్యాంక్‌- గోవా కార్బన్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో ఓవైపు బంధన్‌ బ్యాంక్‌ ప్రొత్సాహకర ఫలితాలు సాధిస్తే.. మరోపక్క గోవా కార్బన్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది.  క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బంధన్‌ బ్యాంక్‌ 10 శాతం అధికంగా రూ. 331 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) సైతం 54 శాతం జంప్‌చేసి రూ. 1124 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 9.9 శాతం నుంచి 10.3 శాతనికి బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బంధన్‌ బ్యాంక్‌ 4 శాతం ఎగసి రూ. 474 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 451 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

Image result for goa carbon limited

గోవా కార్బన్‌
గోవా కార్బన్‌ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ. 5 కోట్లమేర నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2017-18) క్యూ3లో రూ. 22.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం 50 శాతం క్షీణించి రూ. 94 కోట్లకు పరిమితమైంది. గతంలో రూ. 38 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించగా ఈ క్యూ3లో రూ. 6 కోట్ల ఇబిటా నష్టాన్ని ప్రకటించింది. 

ప్లాంట్ల మూసివేత
అక్టోబర్‌-డిసెంబర్‌'18 కాలంలో గోవా ప్లాంటును 55 రోజులు, బిలాస్‌పూర్ ప్లాంటును 66 రోజులు, పారదీప్‌ యూనిట్‌ను 61 రోజులు చొప్పున మూసివేసినట్లు గోవా కార్బన్‌ తెలియజేసింది. దీంతో ఫలితాలు ప్రభావితమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గోవా కార్బన్‌ షేరు 1.2 శాతం నీరసించి రూ. 535 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 569 సమీపంలో గరిష్టాన్ని తాకగా.. రూ. 519 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది.Most Popular