ఫ్లెక్సీటఫ్‌, ట్రైడెంట్- హైజంప్‌

ఫ్లెక్సీటఫ్‌, ట్రైడెంట్- హైజంప్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఫ్లెక్సీటఫ్‌ వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. మరోపక్క డిసెంబర్‌లో పేపర్, కెమికల్స్‌ తదితరాల ఉత్పత్తి వివరాలను వెల్లడించిన ట్రైడెంట్ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం నష్టాల మార్కెట్లోనూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం...

 ఫ్లెక్సీటఫ్‌ వెంచర్స్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఫ్లెక్సీటఫ్‌ వెంచర్స్‌ నికర లాభం 6 రెట్లు ఎగసి రూ. 8.6 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 19 శాతం పెరిగి రూ. 316 కోట్లను అధిగమించింది. ఎఫ్‌ఐబీసీ, జియో టెక్స్‌టైల్‌ ఫ్యాబ్రిక్‌ తదితరాల తయారీలో ఉన్న ఈ కంపెనీలో ప్రమోటర్లకు 32.88 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఫ్లెక్సీటఫ్‌ వెంచర్స్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 52 వద్ద ఫ్రీజయ్యింది.

Image result for trident limited

ట్రైడెంట్‌ లిమిటెడ్‌
హోమ్‌ టెక్స్‌టైల్స్‌ సంస్థ  ట్రైడెంట్‌ లిమిటెడ్‌ డిసెంబర్‌లో 12,215 మెట్రిక్‌ టన్నుల పేపర్‌ను, 8,304 మెట్రిక్‌ టన్నుల కెమికల్స్‌నూ ఉత్పత్తి చేసినట్లు తాజాగా వెల్లడించింది. ఈ బాటలో 3281 మెట్రిక్‌ టన్నుల బాత్‌ లైనెన్‌, 9515 మెట్రిక్‌ టన్నుల యార్న్‌నూ తయారు చేసినట్లు తెలియజేసింది. ఇదే విధంగా 2.68 మిలియన్‌ మీటర్ల బెడ్‌ లైనెన్‌నూ రూపొందించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ట్రైడెంట్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 70 వద్ద ట్రేడవుతోంది. డైవర్సిఫైడ్‌ కార్యకలాపాలు గల కంపెనీలో ప్రమోటర్లకు 68.45 శాతం వాటా ఉంది.Most Popular