అటు యూరప్‌- ఇటు సెన్సెక్స్‌ డౌన్

అటు యూరప్‌- ఇటు సెన్సెక్స్‌ డౌన్

వచ్చే వారం బ్రెక్సిట్‌పై కీలక వోటింగ్‌ జరగనున్న నేపథ్యంలో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం యూకే 0.4 శాతం, ఫ్రాన్స్‌ 0.6 శాతం, జర్మనీ 0.75 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. కాగా.. మరోపక్క నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం బలహీనంగా కదులుతున్నాయి. స్వల్ప ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 94 పాయింట్లు క్షీణించి 36,119కు చేరగా.. నిఫ్టీ 37 పాయింట్లు బలహీనపడి 10,818 వద్ద ట్రేడవుతోంది.  

Image result for european markets

బ్లూచిప్స్‌ తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1 శాతం క్షీణించగా.. రియల్టీ, ఆటో, మీడియా 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, యూపీఎల్‌, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌, టైటన్‌, జీ, ఎల్‌అండ్‌టీ 1.6-0.55 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్‌పీసీఎల్‌, ఇండస్‌ఇండ్, యాక్సిస్‌, గ్రాసిమ్‌, ఐవోసీ, ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ ఫార్మా, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, కొటక్‌ బ్యాంక్‌ 3-1.4 శాతం మధ్య డీలాపడ్డాయి. ఇక రియల్టీ స్టాక్స్‌లో యూనిటెక్‌, డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, ఇండియాబుల్స్‌, శోభా 2.5-0.6 శాతం మధ్య పెరిగాయి. 

డెరివేటివ్స్‌ తీరిలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ ప్రు, సౌత్‌ ఇండియన్‌, మణప్పురం, దివీస్‌, అమరరాజా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, పిడిలైట్‌, అరబిందో ఫార్మా 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా మరోవైపు ఐడీబీఐ, భారత్‌ ఫైనాన్స్‌, బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌హెచ్‌పీసీ 2.8-1.6 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ప్లస్‌లో
మార్కెట్లు బలహీనంగా కదులుతున్న నేపథ్యంలో చిన్న షేర్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1166 లాభపడగా.. 1225 నష్టాలతో ట్రేడవుతున్నాయి.Most Popular