10 ఏళ్ళలో 4,500 శాతం పెరిగి, 45 రెట్లు లాభాలు పంచిన స్టాక్ ఇదే..!

10 ఏళ్ళలో 4,500 శాతం పెరిగి, 45 రెట్లు లాభాలు పంచిన స్టాక్ ఇదే..!

మార్కెట్లలో బ్లూ చిప్ షేర్లు కొన్నా లాభాలు కనబడని ఈ రోజుల్లో మదుపర్ల అంచనాలకు మించి  రాణించిన స్టాక్ ఒకటుంది. గత 10 ఏళ్ళల్లో స్థిరంగా లాభాలను పంచుతూ.., 4500శాతం పెరిగిన స్టాక్ అది. 2009 జనవరి 1 న రూ. 10,000 పెట్టుబడి పెట్టిన వారికి డిసెంబర్ 2018 నాటికి రూ. 4,50,000 ఇచ్చిన స్టాక్ ఆర్తి ఇండస్ట్రీస్‌ది మాత్రమే. అవునండీ వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. కెమికల్స్ రంగంలో 78శాతం రెవెన్యూ, ఫార్మా రంగంలో 15శాతం రెవెన్యూ, గృహ&పర్సనల్ కేర్ రంగంలో 7శాతం రెవిన్యూ కలిగిన ఆర్తి ఇండస్ట్రీస్ గత సంవత్సరం 27శాతం గ్రోత్‌తో ర్యాలీ చేసింది. 2019లో కూడా పలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల పోర్ట్ ఫోలియోలో అగ్రభాగంలో నిలిచింది ఈ మిడ్ క్యాప్ స్టాక్. గత పదేళ్ళలో ఈ స్టాక్ కొన్న ఇన్వెస్టర్లకు 45 రెట్లు లాభాలు పంచింది ఆర్తి ఇండస్ట్రీస్. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ పోర్టల్ కూడా ఈ స్టాక్ మీద పలు కథనాలను ప్రచరించింది గత సంవత్సరంలో. PYT కస్టమర్లకు రిఫర్ చేసిన స్టాక్ కూడా ఇదే. అత్యంత విజయవంతం అయిన ఆర్తి ఇండస్ట్రీస్ స్టాక్ మీద బ్రోకరేజ్ సంస్థలు ఈ సంవత్సరం కూడా ఎక్కువ అంచనాలే పెట్టుకున్నాయి. మిడ్ క్యాప్ రంగం 2018లో కుదేలైనా.. ఈ స్టాక్ మాత్రం హిట్టింగ్ చేస్తూ పోయింది. యాక్సిస్ సెక్యూరిటీస్ ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్‌ రూ. 1,740 గా పేర్కొంటుంది. సామర్ధ్య విస్తరణ, పెరుగుతున్న డిమాండ్ వంటివి కంపెనీ రెవెన్యూను పెంచుతున్నాయి. కొత్త వ్యాపారాల కల్పన, మల్టీ ఇయర్ ఒప్పందాలు వంటివి రానున్న 2 ఏళ్ళలో ఆర్తి ఇండస్ట్రీస్ రెవెన్యూను డబుల్ చేస్తాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. 2017-18 వార్షిక నివేదికలో  చైనాలోని పర్యావరణ ఆందోళనల వల్ల , అక్కడి కెమికల్స్ , ఫార్మా ఉత్పత్తులు తగ్గడంతో భారతీయ కంపెనీలకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కెమికల్ ఉత్పత్తులకు అవకాశాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ రంగంలో వృద్ధిని సాధించడానికి అది దోహద పడిందని ఆర్తీ ఇండస్ట్రీస్ వెల్లడించింది. 

Image result for aarthi industries
1984లో ఇన్ కార్పోరేట్ గా రంగంలోకి దిగిన ఈ కంపెనీ బెంజీన్ డెరివేటివ్స్ ఉత్పత్తుల్లో అగ్రగామిగా నిలిచింది. దాదాపు 17 ఉత్పత్తి ప్లాంట్లతో  , 200 ఉత్పత్తుల అమ్మకాలతో, 60 దేశాలకు తన సరుకును ఎగుమతులు చేస్తూ తన వ్యాపారాన్ని విస్తరించింది.  ఆర్తి ఇండస్ట్రీస్ తన హోమ్ అండ్ పర్సనల్ కేర్ రంగాన్ని పూర్తిగా విలీనం చేసుకునే దిశగా యత్నాలు చేస్తుంది. అందులోని షేర్ హోల్డర్స్ కూడా ఇప్పుడు ఆర్తీ ఇండస్ట్రీస్‌లో వాటా దారులు అవుతారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ విలీనం 2019 ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి పూర్తి కానుంది . ఈ విలీనం జరిగాక ఆర్తీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మరింత పెరగొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. చైనా ఎగుమతులు నిలిచి పోవడం, కంపెనీ ఉత్పత్తుల సామర్ధ్యం పెరగడం వంటి కారణాల వల్ల 2019లో కూడా ఈ స్టాక్ ను పిక్ చేసుకోమని ఎనలిస్టులు సూచిస్తున్నారు. 
 Most Popular