సౌత్‌ ఇండియన్‌.. ప్లస్‌- లక్స్‌.. నో లక్

సౌత్‌ ఇండియన్‌.. ప్లస్‌- లక్స్‌.. నో లక్

కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న మార్కెట్లలో కొన్ని కౌంటర్లలో బ్లాక్‌డీల్స్‌ జరుగుతున్నాయి. ఈ బాటలో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ కౌంటర్లో రెండు బ్లాక్‌ డీల్స్‌ నమోదయ్యాయి. వీటి ద్వారా 1.26 కోట్ల షేర్లు చేతులు మారాయి. మరోవైపు కోల్‌కతా సంస్థ లక్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో ఉన్నట్టుండి ట్రేడింగ్‌ పరిమాణం భారీగా పెరిగింది. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఇప్పటివరకూ ఈ కౌంటర్లో రెండు రెట్లు అధికంగా షేర్లు ట్రేడయ్యాయి. గత రెండు వారాల్లో సగటున 820 షేర్లు చేతులు మారగా.. ఇప్పటివరకూ 8243 షేర్లు ట్రేడయ్యాయి. 

Related image

షేర్ల తీరిలా
బ్లాక్‌డీల్స్‌ నేపథ్యంలో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 3.5 శాతం పెరిగి రూ. 16 వద్ద ట్రేడవుతోంది. ఇక లక్స్‌ ఇండస్ట్రీస్‌ అయితే 6 శాతం పతనమై రూ. 1147 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1141 వరకూ జారింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. రూ. 1222 వద్ద ఇంట్రాడే గరిష్టాన్నీ తాకింది.

Image result for manappuram finance

మణప్పురం ఫైనాన్స్‌
అనుబంధ సంస్థ ఆశీర్వాద్‌ మైక్రోఫైనాన్స్‌ ప్రభుత్వ రంగ బ్యాంకుతో కలసి రూ. 250 కోట్ల విలువైన మైక్రోఫైనాన్స్‌ పోర్ట్‌ఫోలియోను సెక్యూరిటైజ్‌ చేసినట్లు మణప్పురం ఫైనాన్స్‌ తాజాగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో మణప్పురం ఫైనాన్స్‌ షేరు 2.2 శాతం పుంజుకుని రూ. 98 వద్ద ట్రేడవుతోంది. గోల్డ్‌లోన్స్‌ సంస్థ మణప్పురంలో ప్రమోటర్లకు 35.14 శాతం వాటా ఉంది.Most Popular