యాడ్స్ ధరల పెంపుతో తిరిగి ' రేటింగ్స్ ' పొందుతున్న ప్రింట్ మీడియా స్టాక్స్ !

యాడ్స్ ధరల పెంపుతో తిరిగి ' రేటింగ్స్ ' పొందుతున్న ప్రింట్ మీడియా స్టాక్స్ !

రానున్న రెండు త్రైమాసికాల్లో ప్రింట్ మీడియా స్టాక్స్ రేటింగ్స్ పెరగనున్నాయి. ప్రభుత్వం యాడ్స్ ధరలను 25 శాతం పెంచడంతో వార్తాపత్రికల కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత సంవత్సరం నుండి ప్రింట్ మీడియా స్టాక్స్ దాదాపు 40 నుండి 60శాతం మేరకు నష్టపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం యాడ్స్ ధరలను సవరించి 25శాతం పెంచడంతో ఒక్కసారిగా ఆయా స్టాక్స్ లో కదలిక మొదలైంది. 

Image result for indian news papers
 ప్రభుత్వ ప్రకటనతో DB కార్ప్ స్టాక్ మరింత ఆకర్షణీయమైన స్టాక్స్ గా మారింది మదుపర్లకు. ఈ స్టాక్ లో రిటర్న్ రేషియో ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మంగళవారం నాటి మార్కెట్లో DB కార్ప్ స్టాక్ ఒక్క రోజులోనే 7.6శాతం పెరిగి రూ. 182.65 వద్ద ట్రేడ్ అయింది. అలాగే జయప్రకాష్ నారాయణ్ స్టాక్ కూడా 3శాతం పెరిగి రూ. 117.5 వద్ద నమోదు అయింది. HT మీడియా స్టాక్స్ కూడా అత్యధికంగా 20శాతం పెరిగి రూ. 47.10 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఇది మే 2009 నుండి HT మీడియా స్టాక్స్ ఒక్కరోజులో ఇంత పెరగడం ఇదే తొలిసారి. సాధారణంగా ప్రింట్ మీడియా సంస్థలను 10-15 శాతం రెవెన్యూ ప్రభుత్వ ప్రకటనల ద్వారానే వస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పత్రికలకు ఇది 25-30శాతం గా ఉంటుంది. ఇప్పుడు ప్రకటనలపై ఇచ్చే రేట్లు 25శాతం పెరగడంతో పత్రికలు అధికంగా లాభపడనున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. దాంతో ప్రింట్ మీడియా స్టాక్స్ ఒక్కసారిగా లాభాల్లోకి రావడానికి దోహదపడింది. అంతేకాకుండా ప్రముఖ రేటింగ్స్ సంస్థలు కూడా ఆయా కంపెనీలకు రీ రేటింగ్స్ ఇవ్వనున్నాయి. రానున్న ఎన్నికల నేపధ్యంలో ప్రింట్ మీడియా పనితీరు బాగుంటుందని, ఈ స్టాక్స్ మరింత పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. ఈ ప్రింట్ మీడియాలో యాడ్స్ గ్రోత్ మరింత పెరగనుందని ఎనలిస్టుల భావన. 2019 ఆర్ధిక సంవత్సరం (FY) చివరి త్రైమాసికమైన మార్చ్ కల్లా ఇది మరింత పెరగొచ్చని అంచనా. అలాగే 2020 ఆర్ధిక సంవత్సరం కూడా ప్రింట్ మీడియా రెవెన్యూ పెరగొచ్చని అందుకే ఈ కంపెనీలకు బై రేటింగ్స్ ఇవ్వనున్నట్టు సమాచారం.

Paper snip 1

గతంలో ప్రింట్ మీడియా యాడ్స్ రెవిన్యూ తక్కువగా నమోదు అయ్యేది. GST, RERA వంటి చట్టాల కారణంగా యాడ్స్ రెవిన్యూ గణనీయంగా తగ్గిందనే చెప్పాలి. దీనితో బాటు న్యూస్ ప్రింట్ ధరలు పెరిగిపోవడంతో పలు ప్రింట్ మీడియా సంస్థలు నష్టాల్లోనే నడుస్తున్నాయి. జాగరణ్, DB కార్ప్, HT మీడియా, వంటి సంస్థలు గత సంవత్సరం నుండి మొన్నటిదాకా 38-64 శాతం నష్టపోయినవే.  
DB కార్ప్ స్టాక్స్ టార్గెట్ ప్రైస్ రూ. 190 నుండి రూ.215 కు పెంచింది ICICI డైరెక్ట్ సంస్థ. అలాగే జాగరణ్ స్టాక్స్ మీద టార్గెట్ ప్రైస్ రూ. 112 నుండి రూ. 130 కి పెంచింది. రానున్న  రెండు క్వార్టర్లలో ఈ కంపెనీలు మంచి రిటర్న్స్ ఇస్తాయని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. 

Image result for indian news papersMost Popular