రియల్టీ అప్‌- ప్రయేవేట్‌ బ్యాంక్స్‌ డౌన్‌

రియల్టీ అప్‌- ప్రయేవేట్‌ బ్యాంక్స్‌ డౌన్‌

కన్సాలిడేషన్‌ దిశలో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 56 పాయింట్లు క్షీణించి 36,157కు చేరగా.. నిఫ్టీ 24 పాయింట్లు బలహీనపడి 10,831 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.65 శాతం బలహీనపడగా.. మెటల్‌ 0.25 శాతం నీరసించింది. అయితే రియల్టీ 0.85 శాతం పుంజుకోగా.. ఎఫ్‌ఎంసీజీ, ఆటో 0.35 శాతం చొప్పున బలపడ్డాయి. వరుసగా నాలుగో రోజు అమెరికా స్టాక్ మార్కెట్లు లాభపడినప్పటికీ ముడిచమురు ధరల మంట, రూపాయి నీరసం వంటి అంశాలతో  దేశీయంగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెబుతున్నారు. 

బ్లూచిప్స్‌ తీరిలా
రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, ఇండియాబుల్స్‌, శోభా, ప్రెస్టేజ్‌, బ్రిగేడ్‌ 2.5-0.4 శాతం మధ్య పెరిగాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, యూపీఎల్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఆటో, ఐషర్‌, అదానీ పోర్ట్స్‌, జీ, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌ 2-0.55 శాతం మధ్య పుంజుకున్నాయి. బ్లూచిప్స్‌లో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్, గ్రాసిమ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఐవోసీ, విప్రో, యాక్సిస్‌, హిందాల్కో, ఐసీఐసీఐ 3-1 శాతం మధ్య డీలాపడ్డాయి. 

Image result for icici and axis bank

డెరివేటివ్స్‌ తీరిలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, సౌత్‌ ఇండియన్‌, అమరరాజా, మణప్పురం, పిడిలైట్‌, ఆర్‌ఈసీ, ఐసీఐసీఐ ప్రు, టొరంట్‌ ఫార్మా 3-2 శాతం మధ్య ఎగశాయి. కాగా మరోవైపు భారత్‌ ఫైనాన్స్‌, ఎన్‌హెచ్‌పీసీ, బయోకాన్‌, చెన్నై పెట్రో, భెల్‌ 2.8-1.3 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ప్లస్‌లో
మార్కెట్లు బలహీనంగా ప్రారంభమైనప్పటికీ చిన్న షేర్లకు డిమాండ్‌ పుట్టింది. ప్రస్తుతం బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1144 లాభపడగా.. 976 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో హెచ్‌వోవీఎస్‌, ఆర్షియా, అడోర్‌ వెల్డ్‌, ఓమ్‌ మెటల్స్‌, ఆర్‌సీఎఫ్‌, ఆస్ట్రాజెనెకా, మహారాష్ట్ర స్కూటర్‌, వాస్కన్‌, కనోరియా, ఐబీ ఇంటిగ్రేటెడ్‌, 8కే మైల్స్‌, టాటా బీఎస్‌ఎల్‌, బీఆర్‌ఎన్‌ఎల్‌, త్రివేణీ టర్బైన్‌ తదితరాలు 13-5 శాతం మధ్య జంప్‌చేశాయి.



Most Popular