జోష్‌లో- హడ్కో, బజాజ్‌ కార్ప్‌

జోష్‌లో- హడ్కో, బజాజ్‌ కార్ప్‌

రుణ మంజూరీ భారీగా పెరిగిన నేపథ్యంలో పీఎస్‌యూ దిగ్గజం హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(హడ్కో) లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో ఈ షేరు కళకళలాడుతోంది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో క్వార్టర్‌లో పటిష్ట ఫలితాలు సాధించడం ద్వారా బజాజ్‌ కన్జూమర్ కేర్‌(గతంలో బజాజ్‌ కార్ప్‌) కౌంటర్‌ సైతం నష్టాల మార్కెట్లోనూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం.. 

హడ్కో లిమిటెడ్‌
2018 డిసెంబర్‌కల్లా రుణాల మంజూరీ 2.4 రెట్లు ఎగసి రూ. 12,116 కోట్లను తాకినట్లు హడ్కో లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. ఈ బాటలో 2017 డిసెంబర్‌ కాలంతో పోలిస్తే రుణా విడుదల సైతం 66 శాతం జంప్‌చేసి రూ. 18,850 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో హడ్కో షేరు 3.5 శాతం పుంజుకుని రూ. 44 వద్ద ట్రేడవుతోంది. 

Image result for bajaj corp ltd

బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 60 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతంపైగా ఎగసి రూ. 237 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో బజాజ్‌ కార్ప్‌ షేరు బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 3 శాతం లాభంతో రూ. 383 వద్ద ట్రేడవుతోంది. హెయిర్‌ ఆయిల్స్‌లో పట్టున్న ఈ కంపెనీలో ప్రమోటర్లకు 66.86 శాతం వాటా ఉంది. Most Popular