ఏజీసీ నెట్‌వర్క్స్‌, ఐవోఎల్ కెమ్‌-అదుర్స్‌

ఏజీసీ నెట్‌వర్క్స్‌, ఐవోఎల్ కెమ్‌-అదుర్స్‌

బ్లాక్‌బాక్స్‌ కార్పొరేషన్‌ కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్లు వెల్లడించడంతో ఏజీసీ నెట్‌వర్క్స్‌ కౌంటర్‌ దూకుడు చూపుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్‌ భారీ లాభాలతో సందడి చేస్తోంది. మరోపక్క కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఐవోఎల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మా షేరుకి మరోసారి డిమాండ్‌ కనిపిస్తోంది. వివరాలు చూద్దాం...

ఏజీసీ నెట్‌వర్క్స్‌
అనుబంధ సంస్థ ద్వారా యూఎస్‌ కంపెనీ బ్లాక్‌బాక్స్‌ కార్పొరేషన్‌ను సొంతం చేసుకున్నట్లు తాజాగా ఏజీసీ నెట్‌వర్క్స్‌ పేర్కొంది. డిజిటల్ సొల్యూషన్స్‌ అందించే బ్లాక్‌బాక్స్‌ కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలియజేసింది. దీంతో 25కుపైగా దేశాలలో కార్యకలాపాలు విస్తరించేందుకు దారి ఏర్పడినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో ఏజీసీ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 112 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 114-107 మధ్య ఊగిసలాడింది.

Related image

ఐవోఎల్‌ కెమికల్స్‌ 
దీర్ఘకాలిక బ్యాంకింగ్‌ సౌకర్యాల(రుణ చెల్లింపులు) రేటింగ్‌ను.. కేర్‌ రేటింగ్స్‌ BBB- నుంచి BBB+కు అప్‌గ్రేడ్‌ చేయడంతో ఐవోఎల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మా కౌంటర్‌ ఇటీవల ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో గత వారం రోజుల్లో ఈ షేరు 25 శాతం ర్యాలీ చేసింది. ఈ బాటలో ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో మరోసారి 2.5 శాతం ఎగసి రూ. 203 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 207 వరకూ పెరిగింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం. వెరసి 2008 జనవరి 3న నమోదైన ఆల్‌టైమ్‌ గరిష్టం రూ. 220కు చేరువైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. Most Popular