డెల్టా కార్ప్‌ డీలా- వక్రంగీ జూమ్‌

డెల్టా కార్ప్‌ డీలా- వక్రంగీ జూమ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో క్వార్టర్‌లో సాధించిన ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో డెల్టా కార్ప్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ(ఎంసీఏ) తనిఖీల తరువాత వక్రంగీ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. వివరాలు చూద్దాం.. 

డెల్టా కార్ప్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్)లో డెల్టా కార్ప్‌ నికర లాభం 13 శాతం పెరిగి రూ. 50 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 27 శాతం ఎగసి రూ. 206 కోట్లకు చేరింది. ఇబిటా 22 శాతం పెరిగి రూ. 84 కోట్లను తాకగా.. మార్జిన్లు 42.4 శాతం నుంచి 40.8 శాతానికి బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో డెల్టా కార్ప్‌ షేరు 3 శాతం క్షీణించి రూ. 254 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 262 సమీపంలో గరిష్టాన్ని, రూ. 253 దిగువన కనిష్టాన్నీ తాకింది. 

Image result for vakrangee ltd

వక్రంగీ లిమిటెడ్‌
ఎంసీఏ నిర్వహించిన తనిఖీలలో భాగంగా ఎలాంటి అవకతవకలూ జరిగినట్లు వెల్లడికాకపోవడంతో వక్రంగీ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ ఏర్పడింది. ఈ కౌంటర్లో అమ్మకందారులు కరవుకావడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 37.85 వద్ద ఫ్రీజయ్యింది. 2.9 లక్షల షేర్ల కొనుగోలుకి ఆర్డర్లు పెండింగ్‌లో పడ్డాయి. ఎంసీఏ తనిఖీలలో భాగంగా కంపెనీకి సంబంధించి ఎలాంటి అవకతవకలనూ గుర్తించలేదని వక్రంగీ పేర్కొంది. Most Popular