బ్లూ'చిప్స్‌' అండ- యూఎస్‌ ప్లస్‌లో!

బ్లూ'చిప్స్‌' అండ- యూఎస్‌ ప్లస్‌లో!

రోజంతా ఊగిసలాటకు లోనైనప్పటికీ బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌సహా చిప్స్‌ తయారీ కంపెనీల షేర్లు లాభపడటం ఇందుకు సహకరించింది. దీంతో డోజోన్స్‌ 92 పాయింట్లు(0.4 శాతం) ఎగసి 23,879 వద్ద నిలిచింది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 11 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 2,585 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 60 పాయింట్లు(0.9 శాతం) పెరిగి 6,957 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా నాలుగో రోజు లాభాలతో నిలిచాయి. దీంతో క్రిస్మస్‌ పండుగ సమయంలో తాకిన కనిష్టం నుంచి ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ దాదాపు 10 శాతం ర్యాలీ చేసినట్లయ్యింది. ఇందుకు ప్రధానంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార చర్చలు, డిసెంబర్‌లో ఊపందుకున్న ఉద్యోగ గణాంకాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు ధోరణిలో వెనకడుగు వంటి అంశాలు దోహదం చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

Image result for boeing inc

బోయింగ్‌ అప్‌
గత వారం 10 శాతం పతనమైన యాపిల్‌ దాదాపు శాతం 2 శాతం పుంజుకోగా.. చిప్ కంపెనీలు బలపడటంతో ఫిలడెల్ఫియా సెమీకండక్టర్‌ ఇండెక్స్‌ 2.5 శాతం ఎగసింది. వాణిజ్య వివాదా పరిష్కారంపై అంచనాలతో వరుసగా రెండో రోజు బోయింగ్‌ షేరు 1 శాతం బలపడింది. 2019 ఆదాయ అంచనాలలో కోతపెట్టడంతో కాన్‌స్టెలేషన్‌ బ్రాండ్స్‌ దాదాపు 13 శాతం కుప్పకూలింది. చమురు ధరలు జోరందుకోవడంతో ఇంధన రంగం 1.5 శాతం పుంజుకుంది. వడ్డీ రేట్ల పెంపు చేపట్టేందుకు వేచిచూడటమే మేలని అధికశాతం మంది సభ్యులు అభిప్రాయపడినట్లు బుధవారం వెల్లడైన ఫెడ్‌ మినిట్స్‌ పేర్కొంది. 
 
ఆసియా నేలచూపు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి డీల్‌ కుదరవచ్చన్న అంచనాలతో బుధవారం మరోసారి యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు 0.8 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో ఇండొనేసియా(0.25 శాతం) మినహా అన్ని మార్కెట్లూ నేలచూపులతో కదులుతున్నాయి. జపాన్‌ 1.5 శాతం వెనకడుగువేయగా.. హాంకాంగ్, తైవాన్‌, కొరియా, చైనా, సింగపూర్‌ 0.5-0.2 శాతం మధ్య నీరసించాయి. థాయ్‌లాండ్‌ నామమాత్ర నష్టంతో ట్రేడవుతోంది. Most Popular