సానుకూల ఓపెనింగ్‌- తదుపరి?! 

సానుకూల ఓపెనింగ్‌- తదుపరి?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకుని 10,905 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. బుధవారం హెచ్చుతగ్గుల మధ్య అమెరికా స్టాక్‌ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. ప్రధానంగా ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌, చిప్‌ తయారీ కంపెనీలు లాభపడటం మార్కెట్లకు దన్నునిచ్చింది. బుధవారం యూరోపియన్‌ మార్కెట్లు సైతం 0.8 శాతం స్థాయిలో లాభపడగా... ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. దీంతో నేడు దేశీయంగానూ మార్కెట్లు ఊగిసలాటకు లోనయ్యే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

36000కు పైనే
ముందుగా అనుకోనప్పటికీ వాణిజ్య వివాద చర్చలను మూడో రోజు కొనసాగించేందుకు అమెరికా, చైనా ఆసక్తి చూపిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి. అయితే మిడ్‌సెషన్‌లో అనూహ్యంగా అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాలలోకి సైతం ప్రవేశించాయి. తిరిగి చివర్లో కొనుగోళ్లు పెరగడంతో రికవర్‌ అయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 36,250-35,863 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి 232 పాయింట్లు ఎగసి 36,213 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 10870-10749 మధ్య ఊగిసలాడిన నిఫ్టీ సైతం చివరికి 53 పాయింట్లు జమచేసుకుని 10,855 వద్ద స్థిరపడింది. 

Image result for share traders india

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,780 పాయింట్ల వద్ద, తదుపరి 10,704 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,901 పాయింట్ల వద్ద, తదుపరి 10,946 స్థాయిలోనూ అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 27,502 వద్ద, తదుపరి 27,283 వద్ద సపోర్ట్‌ కనిపించవచ్చని... మరోవైపు 27847, 27973 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు.
   
రెండువైపులా కొనుగోళ్లు 
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 276 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 440 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా..  మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 534 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 698 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. Most Popular