వాణిజ్య చర్చల జోష్‌- చివర్లో హుషార్‌

వాణిజ్య చర్చల జోష్‌- చివర్లో హుషార్‌

ముందుగా అనుకోనప్పటికీ వాణిజ్య వివాద చర్చలను మూడో రోజు సైతం కొనసాగించేందుకు అమెరికా, చైనా ఆసక్తి చూపిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. అయితే మిడ్‌సెషన్‌లో అనూహ్యంగా అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాలలోకి సైతం ప్రవేశించాయి. తిరిగి చివర్లో కొనుగోళ్లు పెరగడంతో రికవర్‌ అయ్యాయి. మరోవైపు యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు సైతం హుషారుగా ప్రారంభంకావడంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తొలుత లాభాల డబుల్‌ సెంచరీ చేసిన సెన్సెక్స్‌ మిడ్‌సెషన్‌కల్లా నష్టాలలోకి ప్రవేశించి చివర్లో తిరిగి జోరందుకుంది. ఫలితంగా 36,250-35,863 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 232 పాయింట్లు ఎగసి 36,213 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 10870-10749 మధ్య ఊగిసలాడిన నిఫ్టీ సైతం చివరికి 53 పాయింట్లు జమచేసుకుని 10,855 వద్ద స్థిరపడింది.

Image result for base metals

మెటల్స్‌ నేలచూపు
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ. ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ, ఆటో 1-0.5 శాతం మధ్య పుంజుకోగా, మెటల్స్‌ 1.2 శాతం వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐబీ హౌసింగ్‌, ఇండస్‌ఇండ్, ఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌, టాటా స్టీల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హీరోమోటో, ఐవోసీ, ఓఎన్జీసీ 4-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. 

చిన్న షేర్లు వీక్‌
మిడ్‌సెషన్‌లో మార్కెట్లు లాభాలను పొగొట్టుకున్నప్పటికీ చివర్లో ఊపందుకున్నాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచీ చిన్న షేర్లలో వీక్‌ ట్రెండ్‌ కొనసాగింది. దీంతో బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 1155 లాభపడగా.. 1442 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 534 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 698 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 736 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 142 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. Most Popular