ఇండస్ ఇండ్ బ్యాంక్  మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి..!

ఇండస్ ఇండ్ బ్యాంక్  మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి..!

ముంబైకి చెందిన ప్రైవేట్ బ్యాంక్ అయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ తన మూడో క్వార్టర్ ఫలితాలను వెల్లడించింది. బ్యాంక్ నెట్ ప్రాఫిట్ గత ఏడాదితో పోలిస్తే.. 5.23 శాతం పెరిగి రూ. 985 కోట్లుగా నమోదు చేసింది. నెట్ ఇంట్రెస్ట్ ఆదాయం కూడా 21శాతం పెరిగి రూ. 2,228 కోట్లుగా ఉంది. కాగా ఇండస్ ఇండ్ బ్యాంక్ IL&FSలో తన పెట్టుబడులను కొనసాగించింది. వీటిని స్టాండర్డ్ గా అభివర్ణించింది. ప్రస్తుతం IL&FSలో ఇండస్ ఇండ్ బ్యాంకు పెట్టుబడులు రూ. 600 కోట్లుగా ఉన్నట్టు బ్యాంకు పేర్కొంది. అసెట్స్ క్వాలిటీ విషయంలో బ్యాంక్ కొంత తడబడిందని,  మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు రేషియో గత సంవత్సరం కంటే.. పెరిగాయని బ్యాంకు తెలిపింది. గత సంవత్సరం మొండి బకాయిల రేషియో 1.09శాతం ఉండగా, ఈ మూడో క్వార్టర్‌లో అది 1.13శాతం గా ఉంది. 

నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కం 21శాతం పెరిగి రూ. 2,288.1 కోట్లుగా ఉంది. క్రెడిట్ గ్రోత్ ఈ డిసెంబర్ నాటికి 35శాతంగా(Y on Y)  ఉంది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్  ఈ 3 వ క్వార్టర్‌లో 3.83శాతంగా నమోదు చేసింది. డిపాజిట్ల గ్రోత్ కూడా గత సంవత్సరం కంటే.. 20శాతం వృద్ధిని నమోదు  చేసింది. ILFSలో ఉన్న వాటా రూ. 600 కోట్లను కూడా కలుపుకుంటే..వార్షిక ప్రాతిపదికన  వృద్ధి శాతం 157శాతం గా ఉందని ఇండస్ బ్యాంక్ పేర్కొంది.  నెట్ క్రెడిట్ కాస్ట్ 17 బేసిస్ పాయింట్లు పెరిగాయి.  గ్రాస్ NPA వచ్చేసి 10శాతం వృద్ధితో రూ. 1,968.15 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికానికి నెట్ NPA  రూ. 1,029.27 కోట్లుగా ఉంది. నిర్వాహణ లాభాలు ఈ క్వార్టర్‌లో 27శాతం పెరిగాయని బ్యాంకు MD , మరియు CEO రోమేష్ సోబ్టీ పేర్కొన్నారు. 
పలు సెక్టార్లకు కేటాయింపులు జరపడంతో లాభదాయకతపై ఒత్తిళ్ళను ఎదర్కొన్నట్టు ఇండస్ బ్యాంక్ తెలిపింది. కాగా ఇండస్ బ్యాంక్ మూడో క్వార్టర్ ఫలితాల వెల్లడి తరువాత బ్యాంక్ స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలి.. మళ్లీ పుంజుకున్నాయి. ఫలితాల వెల్లడి సమయంలో 0.49శాతం నష్టపోయిన షేర్ ఫలితాల వెల్లడి తరువాత 0.94శాతం పుంజుకుని రూ. 1594 .20 వద్ద ట్రేడ్ అవుతోంది. 
Q3 Results: IndusInd Bank Meets Estimates Despite Higher Provisions Most Popular