లావాదేవీల జోరు- షేర్లు అటూఇటూ! 

లావాదేవీల జోరు- షేర్లు అటూఇటూ! 

కన్సాలిడేషన్‌ బాటలో కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో కొన్ని కౌంటర్లు అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లను భారీగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ కౌంటర్లలో ట్రేడింగ్‌ జోరుగా సాగుతోంది. వీటిలో నేడు బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ బలహీనపడగా.. మిగిలిన కౌంటర్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. వివరాలు చూద్దాం.. 

యస్‌ బ్యాంక్‌: నేడు నిర్వహిస్తున్న బోర్డు సమావేశంలో భాగంగా ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈవో ఎంపిక వివరాలు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో రెండు బ్లాక్‌ డీల్స్‌ జరిగాయి. తద్వారా 25 లక్షల షేర్లు చేతులు మారాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు తొలుత దాదాపు 6 శాతం పతనమై రూ. 182 దిగువకు చేరింది. ప్రస్తుతం 3 శాతం క్షీణించి రూ. 187 దిగువన ట్రేడవుతోంది. 

ఎస్‌కేఎఫ్‌ ఇండియా: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన ఎస్‌కేఎఫ్‌ ఇండియా షేరు ప్రస్తుతం 0.6 శాతం బలపడి రూ. 1934 వద్ద ట్రేడవుతోంది. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఇప్పటివరకూ ఈ కౌంటర్లో ఏకంగా 16 రెట్లు అధికంగా ట్రేడింగ్‌ పరిమాణం నమోదైంది.

గుజరాత్‌ ఫ్లోరోకెమికల్స్‌: పాంచ్‌మహల్‌ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన గుజరాత్‌ ఫ్లోరోకెమికల్స్‌ కౌంటర్‌లో లావాదేవీలు ఊపందుకున్నాయి. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఇప్పటివరకూ 10 రెట్లు అధికంగా ట్రేడింగ్‌ పరిమాణం నమోదైంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 1.2 శాతం లాభంతో రూ. 957 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 975 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.

సద్భావ్‌ ఇంజినీరింగ్‌: అహ్మదాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన సద్భావ్‌ ఇంజినీరింగ్‌ కౌంటర్లో ట్రేడింగ్‌ జోరందుకుంది. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఇప్పటివరకూ 6 రెట్లు అధికంగా షేర్లు చేతులు మారాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 0.7 శాతం నష్టంతో రూ. 223 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 240 వద్ద గరిష్టాన్ని తాకింది.

సనోఫీ ఇండియా: గత 20 రోజుల సగటుతో పోలిస్తే ముంబై కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన సనోఫీ ఇండియా కౌంటర్‌లో ఆరు రెట్లు అధికంగా ట్రేడింగ్‌ పరిమాణం నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 0.55 శాతం పుంజుకుని రూ. 6225 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 6298-6130 మధ్య ఊగిసలాడింది.Most Popular