యూరప్‌ ఖుషీ- సెన్సెక్స్‌ నష్టాలలో

యూరప్‌ ఖుషీ- సెన్సెక్స్‌ నష్టాలలో

అనూహ్యంగా వాణిజ్య వివాద చర్చలను మూడో రోజు సైతం కొనసాగించేందుకు అమెరికా, చైనా ఆసక్తి చూపడంతో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లకు హుషారొచ్చింది. ప్రస్తుతం యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 0.7 శాతం చొప్పున లాభపడి ట్రేడవుతున్నాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు పరిష్కారమయ్యే సంకేతాల నేపథ్యంలో ప్రోత్సాహకరంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో తొలుత లాభాల డబుల్‌ సెంచరీ చేసిన సెన్సెక్స్‌ మిడ్‌సెషన్‌కల్లా నష్టాలలోకి ప్రవేశించింది. 110 పాయింట్లవరకూ పతనమై 36,000 పాయింట్ల దిగువకు చేరింది. ప్రస్తుతం 59 పాయింట్లు క్షీణించి 35,922 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయి 10,775 వద్ద ట్రేడవుతోంది.

Image result for investors at bse

మెటల్‌, బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ 0.8 శాతం పుంజుకోగా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ 2-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐటీసీ, ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌, విప్రో, టాటా మోటార్స్‌, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌, జీ, హెచ్‌యూఎల్‌ 2-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హీరోమోటో, ఐవోసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4-1.2 శాతం మధ్య డీలాపడ్డాయి. 

డెరివేటివ్స్‌ తీరిలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో నిట్‌ టెక్‌, జీఎంఆర్‌, ఐడీబీఐ, ఐసీఐసీఐ ప్రు, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, బాలకృష్ణ, నెస్లే, అశోక్‌ లేలాండ్‌, మదరస్‌సన్, ఎన్‌సీసీ,  4-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా మరోవైపు జిందాల్‌ స్టీల్‌, చెన్నై పెట్రో, ఎన్‌ఎండీసీ, సెయిల్‌, సిండికేట్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, కేన్‌ఫిన్‌, ఆర్‌పవర్‌ 5-3.5 శాతం మధ్య పతనమయ్యాయి.

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు లాభాలను పొగొట్టుకోవడంతోపాటు నష్టాలలోకి ప్రవేశించడంతో చిన్న షేర్లలోనూ వీక్‌ ట్రెండ్‌ కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం చొప్పున బలహీనపడ్డాయి. దీంతో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1016 లాభపడగా.. 1422 నష్టాలతో ట్రేడవుతున్నాయి.Most Popular