మరోసారి గృహ 'బంధన్‌' డీలా!

మరోసారి గృహ 'బంధన్‌' డీలా!

గృహ ఫైనాన్స్‌ను బంధన్‌ బ్యాంక్‌ కొనుగోలు చేయనున్నట్లు వెల్లడైన నేపథ్యంలో ఈ రెండు కౌంటర్లలోనూ వరుసగా మూడో రోజు అమ్మకాలు ఊపందుకున్నాయి. సానుకూల ప్రపంచ సంకేతాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పటిష్ట లాభాలతో ట్రేడవుతున్నప్పటికీ బంధన్‌ బ్యాంక్‌, గృహ ఫైనాన్స్‌ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. మార్టిగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థ గృహ ఫైనాన్స్‌ను షేర్ల స్వాప్‌ ద్వారా బంధన్‌ బ్యాంక్‌ సొంతం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇతర వివరాలు చూద్దాం...

Related image

షేర్లు పతనం
ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో గృహ ఫైనాన్స్‌ షేరు 4.5 శాతం పతనమై రూ. 244 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 242.4 వరకూ పతనమైంది. ఇది 14 నెలల కనిష్టం కాగా.. బంధన్‌ బ్యాంక్‌ షేరు సైతం ప్రస్తుతం 3 శాతం క్షీణించి రూ. 464 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 461 వరకూ జారింది. అయితే ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ షేరు మాత్రం 1 శాతం పుంజుకుని రూ. 1976 వద్ద ట్రేడవుతోంది. కాగా.. బంధన్‌ బ్యాంక్‌తో విలీన వార్తల కారణంగా మూడు రోజుల్లో గృహ ఫైనాన్స్‌ కౌంటర్ 24 శాతం తిరోగమించడం గమనార్హం! ఈ బాటలో గత వారం రోజుల్లో బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్‌ సైతం 16 శాతం పతనమైంది.

Related image

విలీనం ఇలా..
షేర్ల స్వాప్‌ ద్వారా గృహ ఫైనాన్స్‌ను బంధన్‌ బ్యాంక్‌ కొనుగోలు చేయనుంది. ఇందుకు అనుగుణంగా గృహ ఫైనాన్స్‌ వాటాదారులకు ప్రతీ 1,000 షేర్లకుగాను 568 బంధన్‌ బ్యాంక్‌ షేర్లను జారీ చేయనుంది. తద్వారా గృహ ఫైనాన్స్‌ను బంధన్‌ బ్యాంక్‌ విలీనం చేసుకోనుంది. ఫలితంగా బంధన్‌ బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా ప్రస్తుత 82.3 శాతం నుంచి 61 శాతానికి తగ్గనుంది. సెప్టెంబర్‌కల్లా గృహ ఫైనాన్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి 57.86 శాతం వాటా ఉంది. విలీనం తదుపరి బంధన్‌ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీకి 14.96 శాతం వాటా లభించనుంది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనల ప్రకారం బ్యాంకులో ఏదైనా ఒక సంస్థ 10 శాతం వాటాను మించి సొంతం చేసుకునేందుకు వీలులేదు. దీంతో తదుపరి దశలో బంధన్‌ బ్యాంకులో కొంతమేర వాటాను హెచ్‌డీఎఫ్‌సీ విక్రయించాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. షేర్ల విలీన నిష్పత్తి ప్రకారం గృహ ఫైనాన్స్‌ విలువను సుమారు రూ. 22,000 కోట్ల స్థాయిలో నిర్ణయించినట్లు వివరించారు. కంపెనీ మార్కెట్‌ కేపిటలైజేషన్‌ సైతం ఇదే స్థాయిలో ఉన్నట్లు తెలియజేశారు.Most Popular