దిలీప్‌ బిల్డ్‌- టాటా స్టీల్‌ నేలచూపు

దిలీప్‌ బిల్డ్‌- టాటా స్టీల్‌ నేలచూపు

కంపెనీ దీర్ఘకాలిక బ్యాంక్‌ చెల్లింపులపై రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌.. రేటింగ్‌లో కోత పెట్టినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్‌-డిసెంబర్‌)లో అమ్మకాలు క్షీణించినట్లు వెల్లడించడంతో టాటా గ్రూప్‌ మెటల్స్‌ దిగ్గజం టాటా స్టీల్‌ కౌంటర్ అమ్మకాలతో నీరసించింది. వివరాలు చూద్దాం..

దిలీప్‌ బిల్డ్‌కాన్‌
మార్పడికి వీలుకాని డిబెంచర్లు(ఎన్‌సీడీలు), దీర్ఘకాలిక బ్యాంక్‌ సౌకర్యాలు(రుణ చెల్లింపులు)పై రేటింగ్‌ను క్రిసిల్‌ దిగువముఖంగా సవరించినట్లు  వెల్లడించడంతో దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 391 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 408 వద్ద గరిష్టాన్నీ, రూ. 389 వద్ద కనిష్టాన్నీ తాకింది. గతంలో ఇచ్చిన రేటింగ్‌ A+స్టేబుల్‌ రేటింగ్‌ను తాజాగా క్రిసిల్‌ A స్టేబుల్‌కు సవరించినట్లు దిలీప్‌ బిల్డ్‌ తెలియజేసింది. 

Image result for Tata steel

టాటా స్టీల్‌
ఈ ఏడాది(2018-19) క్యూ3లో వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 9 శాతం క్షీణించినట్లు టాటా స్టీల్‌ పేర్కొంది. స్టీల్‌ అమ్మకాలు 2.97 మిలియన్‌ టన్నులకు పరిమితమైనట్లు తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టాటా స్టీల్‌ షేరు దాదాపు 3 శాతం పతనమై రూ. 478 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 497 వద్ద గరిష్టాన్నీ, రూ. 477 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనించదగ్గ అంశం!Most Popular