ఐటీ, ఎఫ్‌ఎంసీజీ అప్‌- మెటల్స్‌ డౌన్‌

ఐటీ, ఎఫ్‌ఎంసీజీ అప్‌- మెటల్స్‌ డౌన్‌

హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు పరిష్కారమయ్యే సంకేతాలతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ చేసింది. 36,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది కూడా. అవసరమైతే మూడో రోజు కూడా వాణిజ్య వివాద చర్చలు కొనసాగనున్నట్లు అమెరికన్‌ డెలిగేషన్‌ ప్రకటించడంతో మంగళవారం అమెరికా, యూరప్‌ మార్కెట్లు లాభపడగా.. ప్రస్తుతం ఆసియాలోనూ ప్రోత్సాహకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్‌ 164 పాయింట్లు ఎగసి 36,145కు చేరగా.. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 10,839 వద్ద ట్రేడవుతోంది.

పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.8-0.5 శాతం మధ్య బలపడగా.. మెటల్‌ 1.4 శాతం నీరసించింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.5 శాతం వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్‌, ఐషర్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా మోటార్స్‌ 2-0.8 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, ఐవోసీ, సిప్లా 3-1 శాతం మధ్య డీలాపడ్డాయి. 

Image result for steel copper aluminium

డెరివేటివ్స్‌ తీరిలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐడీబీఐ, ఐసీఐసీఐ ప్రు, నిట్‌ టెక్‌, జీఎంఆర్‌, నెస్లే, అశోక్‌ లేలాండ్‌, మదరస్‌సన్, ఎన్‌సీసీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్ 4-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా మరోవైపు ఎన్‌ఎండీసీ, జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, జస్ట్‌డయల్‌ 4-2.5 శాతం మధ్య పతనమయ్యాయి.

చిన్న షేర్లు ఫ్లాట్‌
మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్నప్పటికీ చిన్న షేర్లలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1077 లాభపడగా.. 1057 నష్టాలతో ట్రేడవుతున్నాయి.Most Popular