ఆర్‌ సిస్టమ్స్‌ హైజంప్‌- ఎన్‌ఎండీసీ వీక్‌

ఆర్‌ సిస్టమ్స్‌ హైజంప్‌- ఎన్‌ఎండీసీ వీక్‌

సొంత ఈక్విటీ షేర్లను కొనుగోలు(బైబ్యాక్‌) చేయనున్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడంతో మధ్యస్థాయి ఐటీ కంపెనీ ఆర్‌ సిస్టమ్స్‌ ఇంటర్నేషనల్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ షేరు భారీ లాభాలతో సందడి చేస్తోంది. అయితే మరోవైపు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) వివరాలను ప్రకటించిన నేపథ్యంలో పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తడం గమనార్హం. బ్యైబ్యాక్‌పట్ల ఇన్వెస్టర్లు నిరాశపడటంతో ఈ కౌంటర్‌ అమ్మకాలతో బలహీనపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం..

ఆర్‌ సిస్టమ్స్‌ 
ఈ నెల 15న(మంగళవారం) జరగనున్న బోర్డు సమావేశంలో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనపై బోర్డు చర్చించనున్నట్లు ఆర్‌ సిస్టమ్స్‌ ఇంటర్నేషనల్‌ తాజాగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్‌ సిస్టమ్స్‌ కౌంటర్‌వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 13 శాతంపైగా దూసుకెళ్లి రూ. 54 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 57 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. 

Image result for nmdc logo

ఎన్‌ఎండీసీ
బైబ్యాక్‌లో భాగంగా షేరుకి రూ. 98 ధర మించకుండా 3.23 శాతం వాటాను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు ఎన్‌ఎండీసీ తాజాగా తెలియజేసింది. దీనిలో భాగంగా 10.24 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,000 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎన్‌ఎండీసీ షేరు 3.3 శాతం క్షీణించి రూ. 92 దిగువన ట్రేడవుతోంది. Most Popular