క్రిధాన్‌ ఇన్‌ఫ్రా, ఇన్ఫోసిస్‌- జోరు

క్రిధాన్‌ ఇన్‌ఫ్రా, ఇన్ఫోసిస్‌- జోరు

అనుబంధ సంస్థ స్వీ హాంగ్‌ ద్వారా సింగపూర్‌లో కాంట్రాక్టును పొందినట్లు వెల్లడించడంతో క్రిధాన్‌ ఇన్‌ఫ్రా కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో సందడి చేస్తోంది. మరోవైపు వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌తోపాటు.. షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు వెల్లడించడంతో సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ సైతం కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం..

క్రిధాన్‌ ఇన్‌ఫ్రా
సింగపూర్‌లోని అనుబంధ సంస్థ స్వీ హాంగ్‌  ఆ దేశ పబ్లిక్‌ యుటిలిటీస్‌ బోర్డు నుంచి 32.5 మిలియన్‌ సింగపూర్‌ డాలర్ల(సుమారు రూ. 168 కోట్లు) కాంట్రాక్టును పొందినట్లు క్రిధాన్‌ ఇన్‌ఫ్రా తాజాగా పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 6.3 శాతం జంప్‌చేసి రూ. 48 వద్ద ట్రేడవుతోంది.

Image result for infosys

ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌
వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించడంతోపాటు.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)ను సైతం చేపట్టనున్నట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ తాజాగా ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టిసారించారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.6 శాతం పెరిగి రూ. 688 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం(11న) జరగనున్న బోర్డు సమావేశంలో క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలతోపాటు బైబ్యాక్‌, డివిడెండ్‌ అంశాలపై ఇన్ఫోసిస్‌ బోర్డు నిర్ణయాలు ప్రకటించనుంది. రెండేళ్లలోనే తిరిగి బైబ్యాక్‌ను చేపట్టనున్న ఇన్ఫోసిస్‌ ఇందుకు రూ. 11,000 కోట్లకుపైగా వెచ్చించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కనీసం 16 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.Most Popular