సెన్సెక్స్‌ డ'బుల్‌'- అన్ని రంగాలూ!

సెన్సెక్స్‌ డ'బుల్‌'- అన్ని రంగాలూ!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు పరిష్కారమయ్యే సంకేతాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ చేసింది. సాంకేతిక నిపుణులు కీలకంగా భావించే 36,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. అవసరమైతే మూడో రోజు కూడా వాణిజ్య వివాద చర్చలు కొనసాగనున్నట్లు అమెరికన్‌ డెలిగేషన్‌ ప్రకటించడంతో మంగళవారం అమెరికా, యూరప్‌ మార్కెట్లు లాభపడగా.. ప్రస్తుతం ఆసియాలోనూ ప్రోత్సాహకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్‌ 210 పాయింట్లు ఎగసి 36,191కు చేరగా.. నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 10,862 వద్ద ట్రేడవుతోంది.

Image result for bse

రెండు షేర్లు మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 0.5-1 శాతం మధ్య పుంజుకోవడం విశేషం. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌, టాటా మోటార్స్‌, యూపీఎల్‌, హిందాల్కో, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ 1.7-0.8 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఇన్ఫ్రాటెల్‌ 1.4 శాతం, బీపీసీఎల్‌ 0.65 శాతం చొప్పున డీలాపడ్డాయి. 

డెరివేటివ్స్‌ తీరిలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐడీబీఐ, జీఎంఆర్‌, జూబిలెంట్ ఫుడ్‌, ఎంసీఎక్స్‌, కమిన్స్‌, వీగార్డ్‌, నెస్లే, డీఎల్‌ఎఫ్‌ 5.25-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా మరోవైపు ఎన్‌ఎండీసీ, యూబీఎల్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, జస్ట్‌డయల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2.3-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

చిన్న షేర్లు ప్లస్‌లో
మార్కెట్లు హుషారుగా ప్రారంభంకావడంతో చిన్న షేర్లకూ డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 830 లాభపడగా.. 350 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి.Most Popular