యూఎస్‌ మార్కెట్లకు FAANG దన్ను

యూఎస్‌ మార్కెట్లకు FAANG దన్ను

ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌, సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌, ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ జోరందుకోవడంతో మంగళవారం మరోసారి అమెరికా స్టాక్ మార్కెట్లు 1 శాతంపైగా ఎగశాయి. మంత్రివర్గ స్థాయిలో అమెరికా, చైనా మధ్య ప్రారంభమైన వాణిజ్య వివాద పరిష్కార చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నట్లు వెలువడ్డ వార్తలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైతే మూడో రోజు సైతం చర్చలు కొనసాగనున్నట్లు యూఎస్‌ డెలిగేషన్‌ పేర్కొనడం గమనించదగ్గ అంశం. కాగా.. వరుసగా రెండో రోజు ఫాంగ్‌(FAANG) స్టాక్స్‌ దూకుడు చూపడంతో మంగళవారం డోజోన్స్‌ 256 పాయింట్లు(1.1 శాతం) ఎగసి 23,787 వద్ద నిలిచింది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 24 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 2,574 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 74 పాయింట్లు(1.1 శాతం) పెరిగి 6,897 వద్ద స్థిరపడింది. వెరసి మూడు వారాల గరిష్టాలకు చేరాయి.

Image result for faang stocks

బోయింగ్‌ జూమ్
వాణిజ్య వివాదా పరిష్కారంపై అంచనాలతో బోయింగ్‌ కంపెనీ దాదాపు 4 శాతం జంప్‌చేసింది. 2018లో రికార్డ్‌ సృష్టిస్తూ 806 విమానాలను డెలివరీ ఇచ్చినట్లు వెల్లడించడం కూడా బోయింగ్‌ షేరుకి డిమాండ్‌ పెంచినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. 2019లో ఫేవరెట్‌ కంపెనీగా జేపీ మోర్గాన్‌ పేర్కొనడంతో  ఫేస్‌బుక్‌ 3.3 శాతం ఎగసింది. ఈ బాటలో యాపిల్‌ 2 శాతం పుంజుకోగా.. 1.7 శాతం లాభపడటం ద్వారా అమెజాన్‌ మార్కెట్‌ విలువ 810 బిలియన్‌ డాలర్లను తాకింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రయివేట్‌ కంపెనీగా రెండో రోజూ అమెజాన్‌ రికార్డ్‌ సృష్టించింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్‌ను కుదించడంతో పీజీఅండ్‌ఈ కార్ప్‌ మరోసారి 7.4 శాతం పతనమైంది. సీఈవోగా జిమ్‌ వెనాను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించడంతో యూనియన్‌ పసిఫిక్‌ 9 శాతం దూసుకెళ్లింది.

Image result for boeing inc
 
యూరప్‌, ఆసియా లాభాల్లో
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి డీల్‌ కుదరవచ్చన్న అంచనాలతో మంగళవారం యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ అన్ని మార్కెట్లూ లాభపడ్డాయి. హాంకాంగ్, కొరియా, తైవాన్‌, చైనా, జపాన్‌, సింగపూర్‌ 2.5-1 శాతం మధ్య జంప్‌చేశాయి. మిగిలిన మార్కెట్లలో థాయ్‌లాండ్‌, ఇండొనేసియా 0.7 చొప్పున బలపడ్డాయి. Most Popular