చివరికి లాభాలే- 36,000 దిగువనే!

చివరికి లాభాలే- 36,000 దిగువనే!

ప్రపంచ సంకేతాలు సానుకూలంగా ఉన్న నేపథ్యంలోనూ పడుతూ... లేస్తూ కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 131 పాయింట్లు ఎగసి 35,981 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 30 పాయింట్లు పుంజుకుని 10,802 వద్ద స్థిరపడింది. మిడ్‌సెషన్‌ నుంచీ కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో సాంకేతికంగా కీలకమైన 36,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారం దిశగా చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. దీంతో దేశీయంగా సెంటిమెంటు మెరుగుపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

మీడియా డీలా
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ దాదాపు 3 శాతం జంప్‌చేయగా..  ఫార్మా 1.5 శాతం ఎగసింది. మీడియా 1.25 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, యస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌, ఐబీ హౌసింగ్‌, గ్రాసిమ్‌, బజాజ్‌ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4.2-1.25 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే జీ 3 శాతం పతనంకాగా.. యూపీఎల్‌, కొటక్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఎన్‌టీపీసీ, గెయిల్‌, హిందాల్కో, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.7-1 శాతం మధ్య నీరసించాయి. 

Image result for stock market india
 
చిన్న షేర్లు ఫ్లాట్‌
మార్కెట్లు నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించినప్పటికీ చిన్న షేర్లలో మిశ్రమ ధోరణి నమోదైంది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.2 శాతం నీరసించగా.. స్మాల్‌ క్యాప్‌ అదేస్థాయిలో బలపడింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1264 లాభపడగా.. 1369 నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 736 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 142 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 158 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ దాదాపు రూ. 241 కోట్ల ఇన్వెస్ట్‌ చేశాయి. Most Popular