ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అమెజాన్!  

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అమెజాన్!  

ఆన్‌లైన్‌లో పుస్తకాల విక్రేతగా మొదలైన అమెజాన్ ప్రస్థానం దిన దిన ప్రవర్ధమానమై.. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. గత సోమవారం గ్లోబల్ మార్కెట్లు ముగిసే సమయానికి అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ $796.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 56 లక్షల కోట్లు ) గా పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన కంపెనీగా అమెజాన్ నిలిచింది. ఇది సమీప కంపెనీ మైక్రోసాఫ్ట్ కన్నా 13.2 బిలియన్ డాలర్లు ఎక్కువ. జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ రిటైల్ రంగంలో, ఆన్ లైన్ సేవలతో అగ్రపథంలో నిలిచింది.2013లో అమెజాన్ రెవిన్యూ 74.5 బిలియన్ డాలర్లు కాగా, 2018 చివరి నాటికి కంపెనీ ఆదాయం 177.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరం చివరినాటికి అది 232.2 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. మార్కెట్లు పుల్ బ్యాక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇతర టెక్ దిగ్గజాల తిరోగమనంతో పోలిస్తే..అమెజాన్ తట్టుకుని నిలబడిందనే అంటున్నారు గ్లోబల్ ఎనలిస్టులు. ప్రస్తుతం అమెజాన్ తరువాత స్థానాల్లో మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ ( మాతృసంస్థ ఆల్ఫాబెట్ ) వంటి కంపెనీలు ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ $745.2 బిలయన్ డాలర్లుగాఉంది. 


గ్యారేజ్‌ నుండి మొదలైన ప్రస్థానం
వాషింగ్టన్‌లోని సీయాటెల్ శివారు ప్రాంతంలో ఓ మారుమూల ప్రదేశంలోని ఒక గ్యారేజ్ లో అమెజాన్ పురుడు పోసుకుంది. అన్‌లైన్‌లో నవలలు, పుస్తకాలు అమ్మేందుకు చేపట్టిన ఈ వ్యాపారంలో  " కాడబ్రా" అనే పేరుతో  తన వ్యాపారాన్ని మొదలు పెట్టింది. 1995లో తన తొలి అమ్మకాన్ని జరిపింది అమేజాన్. డగ్లస్ హోఫ్‌స్టడర్ రాసిన  ' ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అండ్ క్రియేటివ్ ఎనాలగ్స్" అనే పుస్తకాన్ని  అమ్మింది అమెజాన్ . దాదాపు దశాబ్దం పాటు కంపెనీ తన లాభాలను వ్యాపారం కోసమే పూర్తిగా ఉపయోగించింది. సరుకు గిడ్డంగులు, పంపిణీ వ్యవస్థలు, సమాచార కేంద్రాలపైనే తన  లాభాలను వెచ్చించింది. క్రమంగా అమెజాన్ ఎదుగుతూ.. ఆన్ లైన్ షాపింగ్ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోకూడ తన వ్యాపారాన్ని విస్తరించింది. ప్రధానంగా వినోదరంగంలో కూడా అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌ల పేరిట వెబ్ సిరీస్‌లు మొదలు పెట్టింది. అమెజాన్ ప్రైమ్ టైం పేరిట వినోద రంగంలో కూడా ప్రముఖంగా వెలుగొందుతూ ఉంది. 
Image result for amazon jeff bezos officeMost Popular