IMF చీఫ్ ఎకనమిస్ట్‌గా భారతీయ మహిళ గీత గోపీనాథ్‌ ..!

IMF చీఫ్ ఎకనమిస్ట్‌గా భారతీయ మహిళ గీత గోపీనాథ్‌ ..!

అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF‌) సంస్థలో చీఫ్‌ ఎకనమిస్ట్‌గా తొలి మహిళ నియమితులయ్యారు. భారత్‌లోని తమిళనాడుకు చెందిన గీతా గోపీనాథ్‌ ఆ పదవిని అధిరోహించారు. ఐఎంఎఫ్‌లో అత్యున్నత పదవి పొందిన తొలి మహిళగా గీత ఈ ఘనతను సాధించారు.  హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ పనిచేసిన గీతా గోపీనాథ్ , ఐఎంఎఫ్‌ పరిశోధన విభాగం డైరెక్టర్‌గా పనిచేసిన మౌరీ ఆస్టెఫెల్డ్‌  పదవీ విరమణ అనంతరం ఈ పదవిలో నియమితులయ్యారు. 

Image result for geetha gopinath
గత ఏడాది అక్టోబరు 1వ తేదీనే గీతా గోపీనాథ్‌ను ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌గా నియమించుకుంటున్నట్లు IMF మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టీన్‌ లగార్డే  వెల్లడించారు. ఆమె ప్రపంచంలోని అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఒకరని ప్రశంసించారు. గీతా గోపీనాథ్‌ ఐఎంఎఫ్‌కు 11వ చీఫ్‌ ఎకనమిస్ట్‌. తనకు ఈ పదవి దక్కడం చాలా అరుదైన గౌరవంగా భావిస్తున్నానని గీత ఆనందం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం, సుంకాలు పెంపు పెద్ద సవాళ్లుగా మారాయని, బహుళజాతి సంస్థలకు ఇబ్బందులు పెరిగాయని గీత వెల్లడించారు. ముందు ముందు ప్రపంచ ఆర్ధిక విధానాలు సరళీకృతంగా జరగడానికి తన వంతు  కృషిని చేస్తానని గీతా గోపీనాథ్ అంటున్నారు. 
 



Most Popular