పడుతూ.. లేస్తూ 36,000కు సెన్సెక్స్‌

పడుతూ.. లేస్తూ 36,000కు సెన్సెక్స్‌

ఉదయం నుంచీ పడుతూ... లేస్తూ కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. మిడ్‌సెషన్‌ నుంచీ కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్‌ మరోసారి సాంకేతికంగా కీలకమైన 36,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 175 పాయింట్లు ఎగసి 36,025 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 43 పాయింట్లు పుంజుకుని 10,815 వద్ద కదులుతోంది. ఎన్‌ఎస్‌ఈలో మీడియా మాత్రమే(0.4 శాతం) వెనకడుగు వేయగా.. మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారం దిశగా చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో మరోపక్క యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. దీంతో దేశీయంగా సెంటిమెంటు మెరుగుపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

బ్యాంక్స్‌, ఫార్మా అప్‌
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2.5 శాతం జంప్‌చేయగా..  ఫార్మా, మెటల్‌, ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1.5-0.6 శాతం మధ్య పెరిగాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ, ఐషర్‌, ఎస్‌బీఐ, ఐబీ హౌసింగ్‌, గ్రాసిమ్‌, టాటా మోటార్స్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 3.6-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే కొటక్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, జీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హిందాల్కో 1.2-0.7 శాతం మధ్య నీరసించాయి. 

Image result for psu banks

పీఎస్‌యూ బ్యాంక్స్‌ జోరు
డెరివేటివ్స్‌లో శ్రేఈ ఇన్‌ఫ్రా, ఇండియన్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, పేజ్‌, అరబిందో, రెప్కో హోమ్‌, స్టార్‌ 6-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు హావెల్స్‌, గోద్రెజ్‌ సీపీ, అపోలో హాస్పిటల్స్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, నాల్కో, దివీస్‌ లేబ్స్‌, మైండ్‌ట్రీ, శ్రీ సిమెంట్స్‌, భారత్ ఫోర్జ్‌ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి.
 
చిన్న షేర్లు అటూఇటూ
మార్కెట్లు నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించినప్పటికీ చిన్న షేర్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.2 శాతం నీరసించగా.. స్మాల్‌ క్యాప్‌ అదేస్థాయిలో బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1179 లాభపడగా.. 1261 నష్టాలతో కదులుతున్నాయి. 



Most Popular