రుణ సమీకరణ కోసం NBFCల పాట్లు..!!

రుణ సమీకరణ కోసం NBFCల పాట్లు..!!

గత సంవత్సరం అత్యంత ఎక్కువగా నష్టపోయిన దేశీయ పారా బ్యాంకులు ఇప్పుడు పునర్‌నిర్మాణ చర్యలు చేపడుతున్నాయి. నగదు లభ్యత కొరత, IL&FS సంక్షోభం వంటివి NBFC కంపెనీలను కుదేలు చేశాయి. ప్రస్తుతం దేశంలోని నాన్ బ్యాంకింగ్ సంస్థలు తమ నిధుల సమీకరణకై డిబెంచర్ బాండ్లను అమ్మకానికి పెట్టాయి. మ్యూచువల్ ఫండ్స్ మీద ఆధార పడటం తగ్గించి సొంతంగా నిధుల సమీకరణ కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (NCDs) అమ్మకాల ద్వారా నిధులను సమీకరించుకోనున్నాయి. IIFL, పిరమాల్ క్యాపిటల్, L&T ఫైనాన్స్, మణుప్పురం ఫిన్, ఆదిత్య బిర్లా, టాటా క్యాపిటల్ ఫైనాన్స్ , ఇండియా బుల్స్ వంటి కంపెనీలు తమ కమర్షియల్ పేపర్స్ అమ్మకం ద్వారా ఇన్వెస్టర్లను ఆకర్షించే యత్నాలు చేస్తున్నాయి. నగదు లిక్విడిటీ సమస్యలను ఈ నిధుల సమీకరణ, రుణ యత్నాలు తీరుస్తాయని అవి భావిస్తున్నాయి. రానున్న 2-3 నెలల్లో ఈ కంపెనీలు దాదాపు రూ. 15,000 -రూ 20,000 కోట్ల నిధులను సమీకరించుకునే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లకు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ బాండ్లను అమ్మడం ద్వారా ఈ నిధులు సమకూరుతాయని అవి పేర్కొంటున్నాయి.NBFCలు ఎదర్కొంటున్న ఈ గడ్డు పరిస్థితుల్లో .. 2010 సంవత్సరం తరువాత ఇంత పెద్ద మొత్తంలో NCDల అమ్మకాలు జరగడం ఇదే తొలిసారని ఇండో స్టార్ క్యాపిటల్ సంస్థ పేర్కొంది.  ఈ బాండ్ల మీద విస్తృతమైన , ఆకర్షణీయమైన లాభాలను ఇన్వెస్టర్లు, లేదా బాండ్ కొనుగోలు దారులు సంపాదించవచ్చు. అదీ మార్కెట్లలో వడ్డీ రేట్లు సమతౌల్యంగా ఉంటేనే.. అని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వీటి మీద వడ్డీ రేట్లు 8.50 శాతం నుండి 9.50 శాతం గా ఉన్నాయి. ఈ బాండ్ల కాల పరిమితి 3,5,7,10 సంవత్సరాలుగా ఉన్నాయి. ప్రస్తుతం NBFCలు జారీ చేస్తున్న కమర్షియల్ పేపర్స్, NCD బాండ్లు పన్ను పరిధిలోకే వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Image result for india bullsImage result for DHFL

నాన్ బ్యాంకింగ్ సంస్థలకు ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు నిధుల పెంపుకు సహాయ పడతాయి. రుణ విస్తరణకు, ద్రవ్య లభ్యత పెంచడానికి ఈ NCDలు దోహద పడతాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. నిధుల లభ్యతతో  తిరిగి తమ కంపెనీ కార్యకలాపాలను పునరుద్ధరించనున్నట్టు ఇండియా బుల్స్ వంటి కంపెనీలు ప్రకటించాయి. దేశ వ్యాప్తంగా గత సంవత్సరం నుండి కొన్ని పారా బ్యాంకులు, NBFCలు తమ కార్యకలాపాలను నిలిపివేసాయి. నగదు లభ్యత కొరవడటం, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం వీటి పట్ల సానూకులంగా స్పందించే వరకూ ఇవి తమ వ్యాపార కార్యక్రమాలను నలిపివేయాల్సి వచ్చింది. ILFS సంక్షోభం తరువాత నాన్ బ్యాంకింగ్ సంస్థలు స్వల్పకాలిక రుణాలను తీసుకోడానికి జంకుతున్నాయి.

Image result for edelweiss financial servicesImage result for iifl logo

కమర్షియల్ పేపర్స్ అమ్మకాల మీద స్వల్పకాలిక రుణాలు తీసుకుని రుణాలు చెల్లించలేని స్థితికి గతంలో IL&FS చేరింది. దీంతో నాన్ బ్యాంకింగ్ సంస్థల పనితీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాగా ప్రస్తుతం ఈ సంస్థలు పబ్లిక్ ఇష్యూ ద్వారా, కమర్షియల్ బాండ్ల విక్రయాల ద్వారా తిరిగి నిధుల సమీకరణకు నడుం బిగించాయి. IIFL, DHFL, ఇండియా బుల్స్, PNB హౌజింగ్ వంటి సంస్థలు తమ కమర్షియల్ పేపర్స్ (CP) ల మీద వాటాలను తగ్గించుకునే యత్నాలు చేస్తున్నాయి. ఈ CPలు స్వల్పకాలిక రుణాలకు సెక్యూరిటీస్ గా పనికొస్తాయి. గతంలో ఇవే నాన్ బ్యాంకింగ్ సంస్థలను హడలెత్తించాయి. గడువులోగా రుణ చెల్లింపులు చేయలేక NBFCలు తమ రేటింగ్స్ ను కోల్పోవాల్సి వచ్చింది. 

Image result for NBFCs In india
ఇప్పటికే ఎడల్వీజ్ గ్రూప్ (ECL ఫిన్ ) డిబెంచర్ల అమ్మకాల ద్వారా రూ. 1,000 కోట్లను సమీకరించుకుంది. రిటైల్ పోర్షన్ రూ. 300 కోట్లుగా, 1.78 రెట్లు క్వాంటమ్ బాండ్లను ఆఫర్ చేసింది. ఇక మహీంద్ర ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్  వంటి కంపెనీలు తమ NCDల అమ్మకాలకు సబ్‌స్క్రిప్షన్లను ఓపెన్ చేశాయి. 
 Most Popular