పేరుకే 5పైసా- ర్యాలీ అదుర్స్‌!

పేరుకే 5పైసా- ర్యాలీ అదుర్స్‌!

ఇండియా ఇన్ఫోలైన్‌(ఐఐఎఫ్‌ఎల్‌) గ్రూప్‌ కంపెనీ 5పైసా కేపిటల్ ఇటీవల లాభాల దూకుడు చూపుతోంది. ప్రధానంగా కంపెనీ ప్రమోటర్‌ నిర్మల్‌ భన్వర్‌లాల్‌ జైన్‌ వాటాను పెంచుకున్నాక భారీ లాభాలతో దూసుకెళుతోంది. వరుసగా 8 రోజులపాటు ర్యాలీ చేయడం ద్వారా 5పైసా కేపిటల్‌ 70 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో నేటి ట్రేడింగ్‌లోనూ తొలుత ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం ఎగసి రూ. 329 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. తిరిగి ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టడంతో ప్రస్తుతం 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌కు చేరింది. రూ. 16 కోల్పోయి రూ. 298 దిగువన ఫ్రీజయ్యింది.

Image result for share investors india
 
ఇతర వివరాలు
ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా కంపెనీ ప్రమోటర్‌ నిర్మల్‌ జైన్‌ 50,000 షేర్లను కొనుగోలు చేసినట్లు డిసెంబర్‌ 26న వెల్లడయ్యాక 5పైసా కేపిటల్‌ షేరు 72 శాతం ర్యాలీ చేసింది. రూ. 191 నుంచి దూసుకెళ్లింది. దీంతో ప్రమోటర్ల వాటా 30.01 శాతం నుంచి 30.4 శాతానికి పెరిగింది. కంపెనీ ప్రధానంగా సెక్యూరిటీస్‌ బ్రోకింగ్‌, ఫైనాన్షియల్‌ ప్రొడక్టుల డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌ నిర్వహిస్తోంది. కాగా.. ప్రమోటర్‌ వాటా కొనుగోలు చేసిన రోజునే సత్పాల్‌ ఖట్టర్‌ కంపెనీలో 1.94 శాతం వాటాకు సమానమైన దాదాపు 2.47 లక్షల షేర్లను విక్రయించారు. షేరుకి రూ. 190 ధరలో వీటిని విక్రయించినట్లు బీఎస్‌ఈలో బల్క్‌ట్రేడ్‌ డేటా తెలియజేసింది.Most Popular