కన్సాలిడేషన్‌లో- ఫార్మా, బ్యాంక్స్‌ ఓకే

కన్సాలిడేషన్‌లో- ఫార్మా, బ్యాంక్స్‌ ఓకే

అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారం దిశగా చర్చలు ప్రారంభమైనప్పటికీ దేశీయంగా స్టాక్‌ మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. ఇన్వెస్టర్లు వేచిచూసేందుకు ఆసక్తిచూపుతుండటంతో మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. కాగా.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ హైజంప్‌ చేయడంతో సోమవారం యూఎస్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్పస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 8 పాయింట్ల నామమాత్ర క్షీణతతో 35,842 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 8 పాయింట్ల వెనకడుగుతో 10,764 వద్ద కదులుతోంది.  

బ్లూచిప్స్‌ తీరు
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా 1 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్‌, జీ, పవర్‌గ్రిడ్‌, కొటక్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, ఎంఅండ్‌ఎం, బీపీసీఎల్‌, హిందాల్కో 1.6-0.8 శాతం మధ్య నీరసించాయి. అయితే సన్‌ ఫార్మా, ఐషర్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ, ఐబీ హౌసింగ్‌, యస్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, హీరోమోటో 3-0.5 శాతం మధ్య ఎగశాయి. 

Image result for share investors india

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌లో వీగార్డ్‌, ఇండియా సిమెంట్స్‌, గోద్రెజ్‌ సీపీ, మైండ్‌ట్రీ, రామ్‌కో సిమెంట్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, అపోలో హాస్పిటల్స్, బీహెచ్‌ఈఎల్‌, కావేరీ సీడ్‌ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. మరోపక్క పేజ్‌, అదానీ పవర్‌, స్టార్‌, అరబిందో, అలహాబాద్‌ బ్యాంక్, శ్రేఈ ఇన్‌ఫ్రా, బెర్జర్‌ పెయింట్స్‌ 4.3-1.7 శాతం మధ్య పుంజుకున్నాయి.
 
మిడ్‌ క్యాప్స్‌ వీక్‌
మార్కెట్లు బలహీనంగా కదులుతున్న నేపథ్యంలో చిన్న షేర్లలోనూ మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.2 శాతం నీరసించింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1036 లాభపడగా.. 1032 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఎస్‌ఐఎల్‌ ఇన్వెస్ట్‌, ఆన్‌మొబైల్‌, యూకెన్‌, అన్సాల్‌, ఐవోఎల్‌, ఆంధ్రా పెట్రో, మారథాన్‌, 8కే మైల్స్‌, కేపిటల్‌ ట్రస్ట్‌, హెచ్‌డీఐఎల్‌, మోన్‌శాంటో, తేజాస్‌ నెట్‌, సీఎంఐ తదితరాలు 12-4.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. Most Popular