ఇప్పటికీ.. ఆకర్షణీయంగానే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ !!

ఇప్పటికీ.. ఆకర్షణీయంగానే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ !!

2018లో పూర్తిగా నిరాశ పరిచిన రంగాలేంటంటే..అవి స్మాల్ , మిడ్ క్యాప్ రంగాలే. మదుపర్ల సంపద పూర్తిగా ఆవిరైపోయిన రంగాలుగా ఇవి ప్రసిద్ధికెక్కాయి. దాదాపు 80శాతం క్షీణించిన ఈ స్టాక్స్ మీద పెట్టబడులు పూర్తిగా నిరాశ పరిచాయి. అయినప్పటికీ.. ఇవి ఇంకా ఆకర్షణీయమనే చెబుతున్నారు బ్రోకరేజ్ సంస్థలు, నిపుణులు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ అయిన TVF క్యాపిటల్ ఎడ్వైజర్స్ పేర్కొన్న దాని ప్రకారం.. 2019లో మంచి ఫలితాలను కనబరిచే రంగాల్లో ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు ఉండొచ్చు. ఈ సంవత్సరంలో మార్కెట్లు  ప్రభుత్వ నిర్ణయాలు, గ్లోబల్ మార్కెట్ల పనితీరును బట్టి ప్రభావితం కావొచ్చు.  GST, RERA, IBC , మార్కెట్లకు నగదు లభ్యత వంటి అంశాలు మార్కెట్లను  సానుకూలంగా నడిపించవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. అలాగే 2019లో వడ్డీ రేట్లు కూడా తగ్గించబడొచ్చని వారి అంచనా. ద్రవ్యోల్బణం 3.3శాతం నుండి 3.5శాతం వరకూ పరిమితమైతే కనుక మార్కెట్లు ఆశావహ ధృక్పథంతో ఉండొచ్చు. 2019 రెండో అర్ధభాగం కల్లా తిరిగి ఫారిన్ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లవైపు చూడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. 
ఎన్నికల ప్రభావం ...
అలాగే ఈ సంవత్సరం వేసవి తరువాత రానున్న సార్వత్రిక ఎన్నికలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయవచ్చు. గత చరిత్ర పరిశీలిస్తే.. 2004, 2009, 2014 ఎన్నికల తరువాతనే మార్కెట్లు కుదురుకున్నాయి. ఈ సారి కూడా ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే కనుక మార్కెట్లు లాభాల్లో కనబడతాయి. 
స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ రంగాలు 
ప్రస్తుతం ఉన్న మార్కెట్ స్థితిగతులు, సాంకేతిక అంతరాయాలు , స్మాల్ , మిడ్ క్యాప్ రంగాలను ప్రభావితం చేయబోవని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫండమెంటల్ ఇష్యూస్ వల్ల గత రెండు మూడేళ్ళుగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాలు కొద్దిగా పతనమైనప్పటికీ.. భవిష్యత్తులో ఇవి వేగంగా పుంజుకుంటాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. 2018లో మిడ్ క్యాప్ సూచీలు 15-16శాతం నష్టపోయాయి. అయితే.. ఇదే సమయంలో ఇందులోని మంచి స్టాక్స్ ను పిక్ చేసుకోడానికి అనువైన సమయంగా మారింది. 2019 చివరికల్లా.. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ రెండంకెల వృద్ధిని నమోదు చేయొచ్చని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 
ఈ రంగాలు బెటర్‌..
మొత్తం మీద దీర్ఘకాలిక మదుపర్ల కోసం ఫైనాన్షియల్ సెక్టార్,  డొమెస్టిక్ హెల్త్ కేర్, పారిశ్రామిక వినియోగదారుల పట్ల మరింత దృష్టి కేంద్రీకరించే సంస్థల వంటి స్టాక్స్ మీద పెట్టుబడులు లాభదాయకమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 
 Most Popular