రుపీ డీలా- మళ్లీ 70కు!

రుపీ డీలా- మళ్లీ 70కు!

డాలరుతో మారకంలో రూపాయి వెనకడుగు వేసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 12 పైసలు నీరసించింది. 69.80 వద్ద మొదలైంది. తదుపరి మరింత బలహీనపడింది. ప్రస్తుతం 32 పైసలు(0.46 శాతం) క్షీణించి 70 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 40 పైసలు తిరోగమించి సాంకేతికంగా కీలకమైన 70 మార్క్‌ను క్రాస్‌ చేసింది. 70.08 వరకూ జారింది. కాగా.. సోమవారం తొలుత స్టాక్‌ మార్కెట్లతోపాటు రూపాయి సైతం జోరందుకుంది. 45 పైసలు ఎగసి 69.27 వరకూ బలపడింది. అయితే మిడ్‌సెషన్‌ నుంచీ మందగించింది. చివరికి 4 పైసల స్వల్ప లాభంతో 69.68 వద్ద స్థిరపడింది. Most Popular