నేలచూపులతో షురూ- ఫార్మా ప్లస్‌లో

నేలచూపులతో షురూ- ఫార్మా ప్లస్‌లో

సానుకూల ప్రపంచ సంకేతాల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం యూఎస్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడినప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 64 పాయింట్లు క్షీణించి 35,786 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 28 పాయింట్ల వెనకడుగుతో 10,744 వద్ద ట్రేడవుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారం దిశగా మంత్రివర్గ స్థాయిలో చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడగా.. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది.

బ్యాంక్స్‌ వీక్
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 0.4 శాతం నష్టపోగా.. ఫార్మా 0.7 శాతం, రియల్టీ 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, ఐబీ హౌసింగ్‌, యాక్సిస్‌, ఎన్‌టీపీసీ, గ్రాసిమ్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌పీసీఎల్‌, యూపీఎల్‌ 1-0.7 శాతం మధ్య నీరసించాయి. అయితే టాటా మోటార్స్‌, సన్‌ ఫార్మా, ఐషర్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, వేదాంతా, హిందాల్కో 2-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. 

Image result for cement industry

సిమెంట్‌ బోర్లా
డెరివేటివ్స్‌లో ఇండియా సిమెంట్స్‌, రామ్‌కో సిమెంట్స్‌, అపోలో హాస్పిటల్స్, సియట్‌, జేపీ, ఇన్ఫీబీమ్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆర్‌కామ్‌, అంబుజా సిమెంట్‌, శ్రీసిమెంట్‌ 3-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే మరోపక్క ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఎన్‌బీసీసీ, అరబిందో, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, ఎన్‌సీసీ 3-1 శాతం మధ్య ఎగశాయి.
 
చిన్న షేర్లు అటూఇటూ
మార్కెట్లు బలహీనంగా కదులుతున్న నేపథ్యంలో చిన్న షేర్లలోనూ మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.1 శాతం నీరసించగా, స్మాల్‌ క్యాప్స్‌ 0.1 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 623 లాభపడగా.. 548 నష్టాలతో కదులుతున్నాయి.



Most Popular