రియల్టీ షేర్లకు జీఎస్‌టీ పుష్‌?!

రియల్టీ షేర్లకు జీఎస్‌టీ పుష్‌?!

ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో రియల్టీ రంగం ఇన్వెస్టర్లను అత్యధికంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ ఇండెక్స్‌ 2 శాతంపైగా ఎగసింది. ఇందుకు వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) కౌన్సిల్‌ గురువారం(10న) సమావేశంకానుండటం కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు, గృహాలపై జీఎస్‌టీని 5 శాతానికి పరిమితం చేయవచ్చన్న అంచనాలు రియల్టీ కౌంటర్లకు డిమాండ్‌ను పెంచుతున్నట్లు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ ఇందుకు సంసిద్ధతను వ్యక్తం చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. కాగా.. జీఎస్‌టీ కౌన్సిల్‌ చిన్న, మధ్యతరహా సంస్థలకు మినహాయింపులను సైతం పెంచనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ అంచనాలతో గత ఐదు రోజుల్లో రియల్టీ ఇండెక్స్‌ 4 శాతం పుంజుకోవడం విశేషం!

Image result for share investors india

షేర్లు లాభాల్లో
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ కౌంటర్లలో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 712కు చేరింది. ఇంట్రాడేలో రూ. 717ను అధిగమించిది. ఈ బాటలో ఇండియాబుల్స్‌ 3.2 శాతం ఎగసి రూ. 90కు చేరగా... డీఎల్‌ఎఫ్‌ 3 శాతం పెరిగి రూ. 180 వద్ద, పెనిన్సులా ల్యాండ్‌ 5 శాతం పురోగమించి రూ. 11.25 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో హెచ్‌డీఐఎల్‌ 7.3 శాతం జంప్‌చేసి రూ. 27.4ను తాకగా, అనంత్‌రాజ్‌ 4 శాతం పెరిగి రూ. 36కు చేరింది. ఇక కోల్టే పాటిల్‌ డెవలపర్స్‌ 3.5 శాతం పుంజుకుని రూ. 272 వద్ద, శోభా 2.4 శాతం పెరిగి రూ. 451 వద్ద కదులుతున్నాయి. ఇదే విధంగా అన్సాల్‌ ప్రాపర్టీస్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 13కు చేరగా.. పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌ 8 శాతం ఎగసి రూ. 8 వద్ద, ఏషియానా హౌసింగ్‌ 1.3 శాతం బలపడి రూ. 120 వద్ద ట్రేడవుతున్నాయి. ఫీనిక్స్‌ మిల్స్‌ స్వల్పంగా 0.6 శాతం బలపడి రూ. 587ను తాకగా.. సన్‌టెక్‌, ఒబెరాయ్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ తొలుత లాభపడినప్పటికీ ప్రస్తుతం స్వల్ప నష్టాలతో వెనకడుగు వేశాయి.Most Popular