ఆసక్తికరంగా గృహ కొనుగోళ్ళు..! హౌజింగ్ సెక్టార్‌ రికవరీ..!!

ఆసక్తికరంగా గృహ కొనుగోళ్ళు..! హౌజింగ్ సెక్టార్‌ రికవరీ..!!

దేశీయ స్టాక్ మార్కెట్లలో హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు గత సంవత్సరం డీలా పడ్డాయి. కానీ ఈ కొత్త సంవత్సరం ఆరంభంలోనే.. ప్రధాన నగరాల్లో హౌజింగ్ మార్కెట్లు రికవరీ అవుతుండటంతో తిరిగి ఇన్వెస్టర్లు వీటి మీద ఆసక్తిని చూపుతున్నారు. సాధారణంగా డొమెస్టిక్ ఇన్వెస్టర్లకు దేశీయ హౌజింగ్ రంగం అనేది ఎప్పూడూ ఆకర్షణీయంగానే కనబడుతుంది. హై క్యాపిటల్ గ్రోత్, ప్రధాన నగరాల్లో గృహ నిర్మాణ రంగంలో అధిక డిమాండ్ వంటివి మదుపర్లను ఊరిస్తుంటాయి. అయితే.. 2014 నుండి  సెక్టార్ కుంటుపడింది. రియల్ ఎస్టేట్ మందగమనం గృహ నిర్మాణ రంగాన్ని నిరుత్సాహ పరిచింది. ఒకప్పుడు దాదాపు 40శాతం రిటర్న్స్ ను ఇచ్చిన హౌజింగ్ సెక్టార్ క్రమేపీ పడిపోవడం ప్రారంభించింది. దీంతో ఇన్వెస్టర్లు దీనిపై ఆసక్తిని కోల్పోయారు. నాన్ బ్యాంకింగ్ సెక్టార్‌ తిరోగమనం, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నగదు కొరత ఏర్పడటం, మొండి బకాయిలు పేరుకుపోవడం వంటి కారణాలతో హౌజింగ్ సెక్టార్ నెమ్మదించింది. కానీ.. 2017 సంవత్సరం ముగింపు సమయంలో కొంత రికవరీ ఏర్పడింది. ఆస్తుల ధరలను స్థిరీకరించడం ద్వారా ముదుపర్ల విశ్వాసాన్ని ప్రోత్సహించాయి దేశీయ మార్కెట్లు. 2018 సంవత్సరం IL&FS సంక్షోభాన్ని చవి చూడటంతో నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యాయి. సంవత్సరం చివరికి వాటికి కాస్త నగదు లభ్యత సాధ్యమైందనే చెప్పొచ్చు. ఇక 2019 జనవరి ఆరంభంలోనే.. దేశంలో ప్రధాన నగరాల్లో హౌజింగ్ డిమాండ్ పెరగడం మొదలైంది. ముంబై, గురుగావ్, నోయిడా, పూణె, బెంగళూరు వంటి నగరాల్లో గృహ నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మార్కెట్లో ఇది 24శాతం పెరుగుదలను చూపిస్తుంది. గత క్వార్టర్‌లో ఇది 17శాతంగా ఉండటం గమనార్హం. ఈ పెరుగుదల మదుపర్లలో తిరిగి ఆసక్తిని పెంపొందించడానికి దోహద పడుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఈ రంగానికి ప్రధానంగా మూడు కారణాలు సపోర్ట్ చేస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. పెద్ద నగరాల్లో ఊహించినట్టే.. ఆస్తుల ధరలు పెరగడం,  కొనుగోలు దారుల అధిక విశ్వాసం, తేలికపాటి పెట్టుబడుల లభ్యత వంటి కారణాల వల్లే.. హౌజింగ్ రంగం పుంజుకోడం మనం గమనించవచ్చు. 

Image result for indian house constructions
దేశ వ్యాప్తంగా ఉద్యోగాల కల్పన పెరగడం , ప్రధాన నగరాల్లో ప్రైవేట్ సెక్టార్‌లో జీత భత్యాలు పెరగడం కూడా ...గృహ కొనుగోళ్ళపై ఆసక్తిని పెంచుతున్నాయి. సిటీల్లో సింగిల్ బెడ్ రూం, డబుల్ బెడ్ రూం ఫ్లాట్లకు డిమాండ్ అధికంగా ఉందని.. కొనుగోలు దారులు కూడా ఎక్కువగా రుణాలు ఇచ్చే సంస్థల హామీలతోనే కొనుగోళ్ళు చేస్తున్నారని బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధి అంటున్నారు. అంతే కాకుండా గృహాల కొనుగోలు చేసిన తరువాత .. 1-2 సంవత్సరాల్లోనే  స్థిరాస్తి రేట్లు పెరుగుతున్నందున  ఈ రంగంలో పెట్టుబడులు సురక్షితమని మదుపర్లు భావిస్తున్నారు. భూమి రేటు ఎప్పటికీ స్థిరంగా ఉంటుందన్న సెంటిమెంట్ తిరిగి మార్కెట్లలో ప్రవేశించిందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం కూడా.. రానున్న సార్వత్రిక ఎన్నికల తరువాత పుంజుకోవచ్చని, అందుకే..ఇప్పుడు తక్కువ ధరల్లోనే గృహ కొనుగోళ్ళు జరపాలని ప్రజలు కోరుకుంటున్నారని బ్రోకరేజ్ నిపుణులు పేర్కొంటున్నారు . అంతేకాకుండా గృహ నిర్మాణ రంగంలో రెరా (RERA) , GST  నిబంధనల సవరింపు కూడా ఈ రంగంపై ముదపర్ల ఆసక్తి పెంచడానికి దోహద పడింది. గృహ నిర్మాణంపై GST స్లాబు రేట్లు తగ్గించవచ్చన్నది నిపుణుల అంచనా. ప్రస్తుతం దేశంలోని రియల్ ఎస్టేట్ పరిశ్రమ అసంఘటిత రంగంలో ఉన్నప్పటికీ.. 2019 ఆఖరుకల్లా.. సంఘటితం అవ్వొచ్చన్నది రియల్టర్ల భావన. 
 Most Popular