జాతీయ పెన్షన్ విధానం - పన్ను మినహాయింపులు

జాతీయ పెన్షన్ విధానం - పన్ను మినహాయింపులు

జాతీయ పింఛన్‌ పథకం (ఎన్‌పిఎస్‌)... పన్ను ఆదాతో పాటు, రిటైర్ మెంట్ అనంతరం జీవితంలో ఆసరా ఇచ్చే పెట్టుబడి పథ కాల్లో ఒకటి. ఎన్‌పిఎస్‌ కింద ఆఫర్‌ చేసే టైర్‌-1, టైర్‌-2 ఖాతాల కింద నామినేషన్‌ సౌకర్యం కూడా ఉంది. 

ఎన్‌పిఎస్‌ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పలు పన్ను రాయితీలు కల్పించింది. ప‌న్ను ఆదా చేసుకునేందుకు ఇదొకి మంచి ప‌థ‌కం అని చెప్పుకోవ‌చ్చు. సెక్ష‌న్ 80 సీ, 80 సీసీడీ కింద ఉద్యోగులు ప‌న్ను ఆదాను చేసుకోవ‌చ్చు.

ఈ పన్ను ప్రయోజనాలు టైర్‌-1 ఖాతాలో జమ అయ్యే మొత్తానికి మాత్రమే వర్తిస్తాయి. తమ ఉద్యోగుల మూల వేతనం, డిఎలో కంపెనీలు 10 శాతం వరకు ఎన్‌పిఎస్‌లో డిపాజిట్‌ చేయవచ్చు. 

ఈ మొత్తం సెక్షన్‌ 80సి కింద ఉద్యోగికి లభించే రూ.1.5 లక్షల పరిమితి దాటినా, మరో రూ.50,000 వరకు సెక్షన్‌ 80 సిసిడి (1బి) కింద ఆదా యం నుంచి మినహాయింపు లభిస్తుంది.

అయితే మొత్తం డిడక్షన్ సెక్షన్ 80సి, 80సిసిసి, సెక్షన్ 80సిసిడి (1) ఒక ఆర్థిక సంవత్సరంలో లక్షన్నర దాటకూడదు.

మరో ముఖ్యమైన విషయం సెక్షన్ 80సిసిడి(1) వేతన జీవులు, అలాగే ఇతర ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా వర్తిస్తుంది.  

అలాగే ఉద్యోగి జమ చేసే మొత్తానికి కూడా సెక్షన్‌ 80 సిసిడి కింద పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే ఉద్యోగి ఎన్‌పిఎస్‌ కింద చెల్లించిన మొత్తం అతడి మూల వేతనం, డిఎలో రూ.లక్షకు లోబడి 10 శాతం దాటకూడదు.

ఇక 80సిసిడి(2) ప్రకారం డిఎ, కనీస వేతనంలో 10 శాతాన్ని మీరు పొందవచ్చు. కాబట్టి ఒకవేళ ఏటా మీ కనీస వేతనం 4 లక్షల రూపాయలైతే అదనంగా మీరు 40,000 రూపాయల పన్ను మినహాయింపును పొందవచ్చు.Most Popular