మళ్లీ రూపాయి 75 కు చేరొచ్చట ! ఈ సారి పట్టాల్సిన స్టాక్స్ ఇవే!!

మళ్లీ రూపాయి 75 కు చేరొచ్చట ! ఈ సారి పట్టాల్సిన స్టాక్స్ ఇవే!!

2018 దేశీయ మార్కెట్లలో ఈక్విటీ, కమోడిటీ, బాండ్స్ , నగదు అంశాలు గ్లోబల్ మార్కెట్ల ప్రభావానికి తీవ్రంగా లోనయ్యాయి. ప్రతిసారీ ఇలా జరుగుతుందని కాదు కానీ.. ఈ సారి మాత్రం  ఇది జరిగింది. రూపీ డాలర్‌తో మారకపు విలువలో కాస్త నిలదొక్కున్నప్పటికీ.. 2019లో రూపీ పతనం మరింత జరగొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నాలుగేళ్ళ క్రితం ముడి చమురు ధరలు బాగా పడిపోడంతో దేశీయంగా బలమైన ఈక్విటీ మార్కెట్ వృద్ధికి దోహద పడింది. డాలర్ల ప్రవాహం దేశంలోకి పెరగడంతో రూపీ బలపడింది. 2019 క్యాలెండర్‌ కూడ మార్కెట్ల విషయంలో గ్లోబల్ పరిస్థితులకు అనుగుణంగా ఉండొచ్చు. 2018లో రూపీ 9శాతం పడిపోయింది. 2018 అక్టోబర్‌లో రూపీ దాదాపు 15శాతం నష్టపోయింది. డాలర్ బలపడటం, క్రూడ్ ఆయిల్ ధరల బ్యారెల్‌కు $86 డాలర్లు కావడం వంటి  కారణాల వల్ల  రూపీ పతనం అవుతూ వచ్చింది. 2018 చివరి నాటికి క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినా.. 2019లో మాత్రం ఇది పెరగొచ్చనే ఎనలిస్టులు భావిస్తున్నారు. ఒపెక్ దేశాల నిర్ణయాలు, ఇరాన్ పై అమెరికా చమురు ఆంక్షల ప్రభావం వల్ల రానున్న కొద్ది నెలల్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ పుంజుకోవచ్చని ఆయిల్ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వేళ అది జరిగితే.. మళ్లీ రూపీ విలువ పతనం బాటనే ఉంటుంది. రూపీ విషయంలో గ్లోబల్ కారణాలు, దేశీయ మార్కెట్ల పరిస్థితులు ప్రభావం చూపవచ్చు. ఇక రూపీ బలోపేతానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI ) తీసుకునే చర్యల పైనే రియల్ ఎఫెక్టివ్  ఎక్స్‌ఛేంజ్ రేటు (REER) ఆధార పడి ఉంటుంది. 2019లో రూపీ మారకపు విలువను పలు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. US ఫెడరల్ వడ్డీ రేట్ల పెరుగుదల, క్రూడ్ ఆయిల్ ధరలు, మన దేశం నుండి ఎగుమతులు, దిగుమతుల రేషియో  వంటివి రూపీ విలువను నిర్ణయించనున్నాయి. దేశంలోని ఫారెక్స్ నిల్వలు పెరిగితే.. రూపీ బలపడుతుంది. అదే దేశంలో ఉన్న డాలర్లు విదేశాలకు నగదు రూపంలో చెల్లించాల్సి వస్తే.. రూపీ బలహీన పడుతుంది. ఇక బ్రెగ్జిట్ ఉదంతం వల్ల యూరో కంటే డాలర్‌నే ఇన్వెస్టర్లు నమ్ముకుంటున్నారు. అంతర్జాతీయంగా మిగతా కరెన్సీల కంటే.. డాలర్‌నే మార్కెట్లు నమ్మే పరిస్థితి వచ్చింది. ఇక దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. సుస్థిర ప్రభుత్వం ఏర్పడకుండా సంకీర్ణం లాంటివి ఏర్పడితే.. తిరిగి రూపీ పతనం మొదలౌతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ 2019 నాటికి రూపీ విలువ డాలర్‌తో పోలిస్తే..రూ. 75 వరకూ చేరుకోవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. 
అదే జరిగితే.. దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపర్లు IT, ఆయిల్ , మెటల్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టుకోవడం సురక్షితమని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. మన దేశం నుండి ఎగుమతి అయ్యే వస్తువులు, కమోడిటీస్ మీద పెట్టుబడులు లాభాలను తీసుకురావచ్చని ఎనలిస్టుల భావన. రానున్న సంవత్సరంలో అంతర్జాతీయంగా మెటల్ , ఐరన్ , కాపర్ రేట్లకు మద్దతు దొరకచ్చన్న సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆయా రంగాల్లో స్టాక్స్ ఎంపిక కూడా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. 2019లో FIIs (విదేశీ ఇన్వెస్టర్లు) దేశీయ మార్కెట్లలో పెట్టుబడులు పెంచితే... రూపీ బలపడొచ్చు. ఒకవేళ అలా జరగకపోయినా.. మిడ్ క్యాప్ రంగం, బ్యాంకింగ్ సెక్టార్లలో పెట్టుబడులు దీర్ఘకాలికంగా లాభాలు తీసుకురావొచ్చని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.  

DISCLAIMER : పైన సూచించిన, లేదా పేర్కొన్న అభిప్రాయాలు నిపుణులు, బ్రోకరేజ్ సంస్థలు వ్యక్త పరిచినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరో సారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.
 Most Popular