ఉద్యోగం మానేశాక పీ.ఎఫ్. పరిస్థితేంటి ?

ఉద్యోగం మానేశాక పీ.ఎఫ్. పరిస్థితేంటి ?

ఒక సంస్థను విడిచిపెట్టి, ఉపాధి కోసం వేరొక ఉద్యోగానికి వెళ్ళిన అనేక మంది ఉద్యోగులు తరచుగా సేకరించిన ప్రావిడెంట్ ఫండ్ (PF) బ్యాలెన్స్ బదిలీని ఆలస్యం చేస్తారు. అయితే వీరిలో కొంత మంది గత కంపెనీలో పని చేసిన కాలంలో జమ అయిన పీఎఫ్ ఫండ్‌ను అలాగే ఉంచుతారు. బ్యాలెన్స్ నిల్వల మీద వడ్డీ రేట్లు వస్తాయన్న ఆశతో. నెల వారీ జమ  ఆ ఎకౌంట్‌లో పడకపోయిన.. గతంలో ఉన్న బ్యాలెన్స్ మీద వడ్డీ వస్తుందని ఆశ పడతారు. కానీ ఇలా చేయడం తప్పని పీఎఫ్ విశ్లేషకులు అంటున్నారు. ఎదైనా ఒక సంస్థను విడిచి పెట్టిన తరువాత 36 నెలల కాలం లోపు పీఎఫ్ ఆఫీస్‌లో ఆ విషయం తప్పకుండా తెలియజేయాలని, లేక పోతే.. ఎకౌంట్‌లో ఉన్న నిధులు మురిగిపోతాయని.. విశ్లేషకులు చెబుతున్నారు. ఒక పీఎఫ్ ఎకౌంట్ 36 నెలల కాలం పాటు వాడకపోతే.. అందులో ట్రాన్సక్షన్లు జరగక పోతే.. అది అసమర్ధ ఖాతాగా పరిగణించబడుతుంది. 2016లో సవరించిన నిబంధనల ప్రకారం 55 సంవత్సరాల రిటైర్‌మెంట్ తరువాత లేదా, 36 నెలల పాటు ఎకౌంట్ వదిలేసినా..  ఆ PF ఖాతా నిష్ప్రయోజనంగా మారుతుంది. అందుకే.. ఒక కంపెనీ వీడి మరో కంపెనీకి ఉద్యోగి వెళ్ళిన తరువాత వీలైనంత తొందరగా ఆ విషయాన్ని పీఎఫ్ ఆఫీస్‌లో తెలియజేయాలి. లేదా పీఎఫ్ ఎకౌంట్ క్లోజ్ చేయ్యాలి. లేదా 55 సంవత్సరాల తరువాత రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ పొందాలంటే.. గతంలో జమ అయిన మొత్తానికి వడ్డీ దక్కాలంటే.. తరచూ పీఎఫ్ ఎకౌంట్‌ను అప్ డేట్ చేసుకోడమే ఉత్తమమని ప్రావిడెంట్ ఫండ్ ఎనలిస్టులు చెబుతున్నారు. ఒక వేళ పీఎఫ్ ఖాతాలో నెల నెల నగదు జమ కాక పోయినా.. గతంలో ఉన్న నిల్వలకు వడ్డీపై ట్యాక్స్ ఫ్రీ సదుపాయం ఉండదు. ఇన్‌ కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT)  ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక ఉద్యోగి EPF ఎకౌంట్ నిలిపి వేసిన తరువాత  అంతకు ముందు  వచ్చిన వడ్డీ మీద పన్ను విధించబడుతుంది. 

Image result for PF employees
ఒక సారి పీఎఫ్ ఎకౌంట్ అసమర్ధ ఎకౌంట్ గా పరిగణించబడితే.. అందులోని నిల్వలు సీనియర్ సిటిజన్ వెల్‌ఫేర్ ఫండ్ కు ట్రాన్స్ ఫర్ అవుతాయి. నిష్ప్రయోజన పీఎఫ్ ఖాతాలను 7 సంవత్సరాల్లోపు క్లియర్ చేసుకోక పోతే.. ఆ ఎకౌంట్లలోని నిధులు సీనియర్ సిటిజన్ ఫండ్ లోకి వెళ్లిపోతాయని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30 తేది నాడు ఈ అన్‌క్లైమ్డ్ ఎకౌంట్లలోని నిల్వలు సీనియర్ సిటిజన్ వెల్ ఫేర్ ఫండ్స్ లోకి బదిలీ చేయబడతాయి. ఇక్కడికి బదిలీ చేసిన పీఎఫ్ నిధులు 25 సంవత్సరాల పాటు ఉంటాయి. ఈ లోపు  పీఎఫ్ ఖాతా దారులు ఇక్కడ క్లయిమ్ చేసుకోడానికి ఒక అవకాశం ఉంది. పీఎఫ్ ఎకౌంట్ నెంబర్ , తగిన ఆధారాలతో క్లెయిమ్ చేసుకుంటే.. సీనియర్ సిటిజన్ వెల్ ఫేర్ ఫండ్ నుండి తిరిగి మన నగదును పొందవచ్చు. అయితే.. అప్పటి వరకూ మనం సంపాదించిన వడ్డీ మాత్రం రాదని నిబంధనలు పేర్కొంటున్నాయి. అప్పటికీ ఎవరూ క్లెయిమ్ చేయని పక్షంలో ఆ నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదలాయిస్తారు. అందుకే.. ఒక ఉద్యోగి తన రిటైర్‌మెంట్ కాగానే సాధ్యమైనంత తొందరగా పీఎఫ్ ఎకౌంట్‌ను సెటిల్ చేసుకోడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ ఉద్యోగి కంపెనీ మారినా.. పీఎఫ్ ఎకౌంట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండటమే మంచిదని వారు పేర్కొన్నారు. 

Image result for indian retired employees


 Most Popular