రెండు నెలల్లో ఈ స్టాక్ 50 శాతం పెరిగింది.. ! అయినా ఇంకా స్ట్రాంగ్

రెండు నెలల్లో ఈ స్టాక్ 50 శాతం పెరిగింది.. ! అయినా ఇంకా స్ట్రాంగ్

ఇండస్ట్రియల్ మెషినరీ తయారీ సంస్థ అయిన కెన్నామెటల్ ఇండియా మార్కెట్లో మంచి పనితీరును కనబరుస్తుంది. గత 6 సంవత్సరాల గరిష్టంతో ఈ షేర్ రూ. 1,156 వద్దకు చేరింది. జనవరి తొలి శుక్రవారం నాటికి ఈ కెన్నా మెటల్ స్టాక్స్ 4శాతం పెరిగింది. గత సెషన్‌లో ఇది 5శాతం లాభపడింది. మార్కెట్లు వీక్‌గా ఉన్నప్పటికీ.. కెన్నా మెటల్ అద్వితీయమైన పనితీరును కనబరచడం విశేషం. గత రెండు నెలలుగా ఈ కంపెనీ స్టాక్స్ రూ. 770 వద్ద నుండి ర్యాలీ చేయడం గమనార్హం. 2018 తొలి త్రైమాసికం ఫలితాల విడుదల నుండి ఈ కంపెనీ స్టాక్స్ వెనుతిరిగి చూడలేదు. ఒక్కసారి డబుల్ జంప్ చేసి మరీ.. రూ. 1,128 వద్దకు చేరింది కెన్నా మెటల్ షేర్. 2019 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికానికి కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ. 24.4 కోట్లుగా ఉంది. గత సంవత్సరంలో ఇదే సమయానికి నెట్ ప్రాఫిట్ రూ. 10 కోట్లుగా ఉంది. ఆపరేషనల్ రెవెన్యూ 25శాతం పెరిగి రూ. 227 కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇది రూ. 181 కోట్లుగా ఉంది.

Image result for kennametal india
ఈ కంపెనీలో దాదాపు 75శాతం  వాటాలు  కెన్నా మెటల్ అమెరికా కు చెంది ఉన్నాయి. అమెరికాలో హార్డ్ మెటల్ , పారిశ్రామిక యంత్రాల తయారీ, ఎరో స్పేస్ విడిభాగాల ఉత్పత్తి, ట్రాన్స్ పోర్ట్, పవర్ జనరేషన్ ఎక్విప్‌మెంట్ తయారీ, డిఫెన్స్ పరికరాల తయారీలో ఈ సంస్థ అగ్రపథాన ఉంది. ఇక దేశంలోని కెన్నా మెటల్స్ 2019 ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రైవేట్ రంగ పెట్టుబడులతో  ముందుకెళ్తుంది. దేశీయంగా ట్రాన్స్ పోర్ట్ రంగంలో విడిభాగాల డిమాండ్ బాగా ఉండటంతో కెన్నా మెటల్స్‌కు సానుకూల అవకాశాలు పెరిగిపోయాయి. కెన్నా మెటల్స్ ఇండియాకు కలిసొచ్చిన మరో అంశం ఎంటంటే.. దేశీయంగా BS VI ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా వాహనాల ఇంజిన్లు BS-IV నుండి మార్చాలని రూలింగ్ రావడంతో కెన్నా మెటల్స్ డిమాండ్ పెరిగింది. ముడి ఖనిజ ఖర్చులు పెరగడం, , ఫారెక్స్ రేట్ల అసమతౌల్యం వంటి సమస్యలు ఎదురైనా కంపెనీ స్థిరమైన వృద్ధిని కనబరచడం విశేషం. 2018 చివరి నాటికి కంపెనీ వద్ద ఆరోగ్యకరమైన ద్రవ్య మిగులు రూ. 95 కోట్లకు పైగా ఉండటం విశేషం. కెన్నా మెటల్ ఇండియా కన్జర్వేటివ్ ఫైనాన్షియల్ పాలసీని అవలంబించడం, మీడియం టర్మ్ లో ఫైనాన్షియల్ రిస్క్ ప్రొఫైల్ స్ట్రాంగ్‌గా ఉండటంతో రేటింగ్ సంస్థ క్రిసిల్ (CRISIL)  ఈ సంస్థకు మంచి రేటింగ్స్ ను కూడా ఇచ్చింది. 
 Most Popular