మార్కెట్లకు ఇక క్యూ3 కిక్‌?

మార్కెట్లకు ఇక క్యూ3 కిక్‌?

దేశీ స్టాక్‌ మార్కెట్లకు ఇకనుంచీ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలు దిక్సూచిగా నిలవనున్నాయి. ఈ వారం ఐటీ దిగ్గజాలతోపాటు పలు బ్యాంకులు సైతం పనితీరు వెల్లడించనున్నాయి. సాఫ్ట్‌వేర్‌ సేవలకు దేశంలోనే నంబర్‌వన్‌ పొజిషన్‌లో ఉన్న టాటా కన్సల్టెన్నీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ఈ నెల 10న(గురువారం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనుంది. ఇదే విధంగా ఐటీ సేవల మరో దిగ్గజం ఇన్ఫోసిస్‌ 11న పనితీరు వెల్లడించనుంది. ప్రధానంగా ఇన్ఫోసిస్‌ ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) సెంటిమెంటుపై ప్రభావాన్ని చూపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇతర కంపెనీలూ
ఈ ఏడాది క్యూ3 ఫలితాలను ఐటీ సేవల సంస్థ టాటా ఎలక్సీ మంగళవారం(8న) ప్రకటించనుండగా, ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఇండస్‌ఇండ్‌ 9న, బంధన్‌ బ్యాంక్‌ 10న కర్ణాటక బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రా 11న పనితీరు వెల్లడించనున్నాయి. కాగా.. ఈ వారం నవంబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు 11న విడుదలకానున్నాయి. అక్టోబర్‌లో ఐఐపీ 8.1 శాతం జంప్‌చేసింది. 

Image result for trade war

విదేశీ అంశాలు
సోమ, మంగళవారాల్లో(7, 8న)  అమెరికా, చైనా మధ్య మంత్రివర్గ స్థాయిలో వాణిజ్య వివాద పరిష్కార చర్చలు జరగనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఈ రెండు దేశాల మధ్య ఏడాది కాలంగా వాణిజ్య వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ ఆర్థిక మందగమన సంకేతాలు సైతం వెలువడుతున్నాయి. దీంతో ఈ చర్చలకు అధిక ప్రాధాన్యమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోపక్క  డిసెంబర్‌ నెలకు అమెరికా వ్యవసాయేతర ఉపాధి వివరాలు, నవంబర్‌ వాణిజ్య గణాంకాలు వెలువడనున్నాయి. ఈ బాటలో జపనీస్‌ కన్జూమర్‌ కాన్ఫిడెన్స్‌, చైనా, యూఎస్‌ల ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం విడుదలకానున్నాయి.

Image result for global stocks

ఇవీ కీలకమే
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు, విదేశీ మార్కెట్లలో నెలకొనే ట్రెండ్‌, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), దేశీ ఫండ్స్‌ పెట్టుబడుల తీరు వంటి పలు ఇతర అంశాలు సైతం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు వివరించారు. గత వారం ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌.. చైనాలో అమ్మకాలు క్షీణిస్తుండటంతో డిసెంబర్‌ క్వార్టర్‌కు గైడెన్స్‌లో కోత పెట్టింది. దీంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తిన విషయం విదితమే.Most Popular