2019లో ఈ కమాడిటీస్ పై దృష్టి పెట్టండి...

2019లో ఈ కమాడిటీస్ పై దృష్టి పెట్టండి...

2018లో కమోడిటీస్ రంగం పూర్తిగా నిరాశ పరిచిందనే చెప్పాలి. ఆయిల్, రాగి, కాఫీ, షుగర్ వంటి రంగాలు భారీ నష్టాలతో ఆ సంవత్సరాన్ని ముగించాయి. మరి ఈ 2019లో కమోడిటీస్ రంగం ఎలా ఉండబోతుంది.ముడి సరుకు విషయంలో, ఎగుమతులు, దిగుమతుల వంటి వాటి  గమనంపైనే కమోడిటీస్ రంగం భవిష్యత్తు ఆధార పడి ఉంటుందా.? లేక కొత్త సంవత్సరంలో ఈ రంగం పుంజుకుంటుందా..? 
రానున్న కొద్ది వారాల్లో అమెరికా చైనా వాణిజ్య యుద్ధం మళ్లీ తెరపైకి రానుంది. సూక్ష్మ ఆర్ధిక రంగం స్థితిగతులు, వరల్డ్ బ్యాంక్ యొక్క గ్లోబల్ ఎకనామిక్ రిపోర్ట్  వంటివి కమోడిటీస్ పై ప్రభావం చూపనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. 

Image result for oil sector
జారుతున్న "ఆయిల్" రంగం
గత సంవత్సరం ఆయిల్ రంగం పూర్తిగా ఒడిదిడుకులకు లోనైంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పతనం, ఒపెక్ దేశాల ముడి చమురు ఉత్పత్తులపై స్వీయ నియంత్రణ, ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు వంటివి ఆయిల్ పరిశ్రమను భయాందోళనలకు గురిచేశాయి. ఇక ఈ సంవత్సరం 2019లో ఆయిల్ రంగం కొంత ఆశాజనకంగానే కనిపిస్తుందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఒపెక్ దేశాల ప్రతినిధుల సమావేశం ఏప్రిల్ మాసంలో జరగనుంది. అప్పటికి క్రూడ్ ఆయిల్ ధరల మీద వాటికి నియంత్రణ రావొచ్చు. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $68 వరకూ రావొచ్చని ఆయిల్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

The Commodities to Watch in 2019The Commodities to Watch in 2019

Image result for gold sector
"బంగారు" అవకాశం 
గత సంవత్సరం కూడా గోల్డ్ కాస్త ఆశాజనకంగానే కనబడ్డా.. అప్పుడప్పుడు స్వల్ప ఒడుదిడుకులకు లోనైంది. ఈక్విటీ మార్కెట్లు పూర్తి అస్థిరతతో ఉన్నప్పుడు ఇన్వెస్టర్ల చూపు గోల్డ్ వైపే మళ్ళింది. దాంతో స్వర్ణ కాంతులు మెరిసాయి. గ్లోబల్ మార్కెట్లలో కూడా బంగారం ధరలు కాస్త పెరుగుతున్నాయి కాబట్టి ఈరంగంలో పెట్టుబడులు పూర్తిగా సురక్షితమనే బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచకపోతే.. బంగారం విషయంలో మరింత పురోగతి కనబడొచ్చు.  గ్లోబల్ మార్కెట్ల మందగమనం కూడా బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి మరో కారణం కావొచ్చు. దేశీయంగా కూడా గోల్డ్ గిరాకీ పెరగడం కూడా కలిసొచ్చే అంశమే.ప్రస్తుతం న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1290.82డాలర్లు కాగా, రానున్న రోజుల్లో ఇది 1350 డాలర్లకు చేరుకోవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. 

The Commodities to Watch in 2019

Related image
విజయం చుట్టు అల్లుకున్న "రాగి" తీగలు 
2015 నుండి రాగికి (కాపర్ )  చిలుము పట్టింది. ప్రతి త్రైమాసికంలోనూ పతనం అవుతూ వస్తున్న స్టాక్స్ ఈ రంగానివే. గ్లోబల్ వృద్ధి రేటు మందగించడం కూడా రాగికి కష్టాలు తెచ్చిపెట్టింది. అమెరికా , చైనా ట్రేడ్ వార్ కూడా రాగి పరిశ్రమకు ప్రతికూలంగా మారింది. అయితే.. ఈ సంవత్సరం మార్కెట్ల సూచీలు అందించే మద్దతుతో రాగి పరిశ్రమ నిలదొక్కుకునే ఛాన్స్ ఉందంటున్నారు ఎనలిస్టులు. ఇప్పటికీ మదుపర్లు రాగి మీద పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం ఇక్కడ గమనార్హం. లండన్ మెటల్ ఎక్స్చేంజ్‌లో కాపర్ గత దశాబ్ద కాలపు కనిష్టానికి ట్రేడ్ అవుతోంది. కానీ..గత సంవత్సరం కాపర్ ఉత్పత్తులను పరిశీలిస్తే.. ఈరంగంలో  అమ్మకాలు మరింత పెరగొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.అంతర్జాతీయ కాపర్ స్టడీ గ్రూప్ సర్వే ప్రకారం  2018 సెప్టెంబర్ నాటికి దాదాపు 595,000 టన్నుల కాపర్ సరఫరా జరిగింది. ఒక వేళ చైనా , అమెరికా ట్రేడ్ వార్‌ ముగిసి.. సయోధ్య ఏర్పడినా,, లేదా కాస్త సద్దుమణిగినా.. కాపర్ పుంజుకోవడం ఖాయం అంటున్నారు బ్రోకరేజ్ నిపుణులు. టన్ను $5,833 డాలర్ల నుండి $6,400 వరకూ పెరగొచ్చని వారి అంచనా. 

The Commodities to Watch in 2019

Image result for soya beans sector
"సోయా" సోయగం వస్తుందా?
అమెరికా నుండి అధికంగా ఎగుమతులు జరిగేవి సోయా ఉత్పత్తులే. అమెరికా నుండి అధికంగా చైనాకు ఎగుమతి అయ్యేవాటిలో కూడా సోయాబీన్స్ దే అగ్రస్థానం. గత సంవత్సరం అమెరికా చైనా ట్రేడ్ వార్ వల్ల ఎక్కువగా నష్టపోయిందీ సోయా రంగమే. 2019లో US, చైనాల మధ్య ఎగుమతులు , దిగుమతుల మీద సుంకాలు తగ్గితే కనుక సోయా రంగం తిరిగి పుంజుకుంటుంది. రానున్న కొద్ది రోజుల్లో జరిగే అమెరికా, చైనా అధికారుల మధ్య చర్చల విషయంలో అమెరికన్ సోయా రైతులు ఎంతో ఆతృతగా ఉన్నారు. చర్చలు సఫలమైతే .. వారి సోయా ఎగుమతుల మీద సుంకాలు తొలిగి పోతాయి. ఈ రెండు దేశాలే కాకుండా బ్రెజిల్ సోయా ఉత్పత్తుల ఎగుమతి దారులు కూడా అమెరికా చైనా చర్చల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏ మాత్రం సానుకూలత ఉన్నా సోయా రంగం విజృంభిస్తుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. 

The Commodities to Watch in 2019

....

Image result for pork meat sector
రుచి కోల్పోయిన  "పోర్క్ మీట్" 
అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనా నుండి ఎగుమతి అయ్యే పోర్క్ మీట్ రంగం తీవ్రంగా ప్రభావితం అయింది. ప్రపంచంలో ఉన్న పందుల్లో 50శాతం పందులు ఒక్క చైనాలోనే ఉన్నాయి. ఎగుమతులు లేక దాదపు 400 మిలియన్ల పందులు చైనాలో ఉండిపోయాయి. అమెరికాకు ఎగుమతులు నిలిచి పోవడంతో చైనాలో పందుల సంతతి పెరిగి వాటికి ఇప్పుడు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ రోగాలు చుట్టుముడుతున్నాయి. దీంతో పోర్క్ ఎగుమతి దారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పందులకు ప్రాణాంతకంగా పరిణమించింది. ప్రస్తుతం చైనాలో దాదాపు 73,000 పందులకు ఈ రోగం సోకినట్టు సమాచారం.  ఒక వేళ అమెరికాతో చర్చలు విఫలమైనా.. 2019 సంవత్సరంలో పోర్క్ ఎగుమతులను ఆసియా దేశాలకు మళ్ళించాని చైనా భావిస్తుంది. చికెన్ కు ధీటుగా పోర్క్ మీట్‌ను జపాన్ , కొరియా వంటి ఆసియా దేశాలకు ఇతర మధ్యప్రాచ్య దేశాలకు తన ఎగుమతులను పెంచాలని చైనా యోచించడం సానుకూల ప్రభావం చూపనుంది. 

The Commodities to Watch in 2019

...

Image result for iron sector
తుప్పు పట్టిన " ఇనుము "
నిర్మాణ రంగం, పరిశ్రమల రంగంలో స్థబ్దత నెలకొన్న పరిస్థితుల్లో ఇనుము తన ప్రాభవాన్ని కోల్పోయింది. గత ఏడాది ఇనుము  టన్నుకు 70 డాలర్లకు పడిపోయింది. బ్రెజిల్ , ఆస్ట్రేలియా దేశాల్లో ఉత్పత్తి పెరగడం, చైనాలో ఉత్పత్తి అయిన ఇనుముకు  అంతర్జాతీయంగా  డిమాండ్ లేక పోవడంతో ఇనుము రంగానికి తుప్పు పట్టింది. 2019లో బీజింగ్ విధాన నిర్ణయాలు, అమెరికా చైనా ట్రేడ్ వార్, కాలుష్య వ్యతిరేక డ్రైవ్ వంటి అంశాల్లో సానుకూలతలు వస్తే.. ఇనుము రంగాన్ని తిరిగి పునర్వైభవం రావొచ్చని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మోర్గాన్ స్టాన్లీ వంటి కంపెనీలు మాత్రం ఇనుము మీద పెట్టుబడులను డేంజరస్‌గా అభివర్ణిస్తుంది. 2019లో ఇనుము టన్ను $62 డాలర్లకు మించదని మోర్గాన్ స్టాన్లీ భావిస్తుంది. 

The Commodities to Watch in 2019Most Popular