రూ.2 వేల నోట్ల  ప్రింటింగ్ బంద్ !! మరో సంచలనానికి రెడీయా..!

రూ.2 వేల నోట్ల  ప్రింటింగ్ బంద్ !! మరో సంచలనానికి రెడీయా..!

ఇప్పటికీ నోట్ల రద్దు ప్రభావం నుండి తేరుకోని సామాన్యుడిపై మరో సమ్మెట పోటు పడనుందా? చలామణిలో ఉన్న నోట్లే దొరకడం లేదంటే.. తాజాగా ఆర్బీఐ రూ. 2000 నోట్ల ముద్రణను ఆపివేస్తుందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే వీటిలో నిజమెంత.? ఆర్బీఐ , ఆర్ధిక వాణిజ్య శాఖలేమంటున్నాయి..?  
రిజర్వు బ్యాంకు రూ.2000నోట్ల ముద్రణను కనిష్ఠ స్థాయికి తగ్గించిందని ఆర్థికశాఖ ఉన్నతాధికారి గురువారం  వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో రూ.2వేల నోటు క్రమేణా కనుమరుగు కానుందని వార్తలు వచ్చాయి. చలామణీలో ఉన్న నగదుపై సమీక్ష జరిపిన కేంద్రం, RBI ఏ మేరకు కొత్త నోట్లను ముద్రించాలన్న దానిపై తగిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే రూ.2వేల నోట్ల ముద్రణను తగ్గించినట్లు తెలిపారు.
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2000 నోట్ల ముద్రణను తగ్గించినట్లు ఆర్థికశాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా పంపిణీ అవుతోన్న నగదు అధారంగా ప్రభుత్వం, ఆర్బీఐ ఎప్పటికప్పుడు నోట్ల ముద్రణ విషయంలో నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. చలామణిలో ఉన్న నగదు కొరత ఉంటే.. ఆర్బీఐ వద్ద నున్న గోల్డ్ నిల్వల ఆధారంగా కొత్త నోట్లను ప్రింట్ చేస్తుంది . కానీ.. ప్రస్తుతం మాత్రం మార్కెట్లలో ఉన్న తాజా పరిస్థితుల ప్రకారం నోట్ల ముద్రణను ఆర్బీఐ కాస్త తగ్గించింది. 
రూ.2వేల నోట్ల ముద్రణ తగ్గిందనీ,,. నోట్ల ముద్రణలో పరిమితి విధించాలని ఆర్బీఐ  నిర్ణయించినట్టు..ఆర్ధిక శాఖ అంటోంది.  ఆర్బీఐ నివేదిక ప్రకారం మార్చి 2017 నాటికి 3,285 మిలియన్ల నోట్ల పంపిణీ జరిగింది. 2017 మార్చి నాటికి 50.2శాతం రెండు వేల నోట్ల ముద్రణ జరగ్గా.. 2018 మార్చి చివరి నాటికి కేవలం 37.3శాతం ముద్రణ మాత్రమే జరిగింది. నవంబరు 8, 2016న రూ.1000, రూ.500నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన తరువాత రూ.2000, రూ.500 కొత్త నోట్లను చలామణీలోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం అవసరమైన దాని కంటే ఎక్కువగానే రూ.2వేల నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్థికశాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ పేర్కొన్నారు.  రూ.2వేల నోట్ల ముద్రణ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన శుక్రవారం వెల్లడించారు. నోట్ల ముద్రణను కనిష్ఠ స్థాయికి తీసుకురానున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పష్టతనిచ్చారు. వ్యవస్థలో ప్రస్తుతం అవసరమైన దాని కంటే ఎక్కువ రూ.2వేల నోట్లు ఉన్నాయి. దాదాపు 35శాతం నోట్లు చలామణీలో ఉన్నాయి. రూ.2వేల నోట్ల ముద్రణకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆయన స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి నోట్ల ముద్రణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.మార్చి 31,2018 నాటికి ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ 18.37 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో దాదాపు 37.3శాతం వాటా రూ. 2000 నోట్లదే ఉంది. Most Popular