వొడాఫోన్ -ఐడియా మార్కెట్ ఎంతపడిపోయిందో తెలుసా?

వొడాఫోన్ -ఐడియా మార్కెట్ ఎంతపడిపోయిందో తెలుసా?

టెలికాం రంగంలో రిలయన్స్ జియో ధాటికి మిగతా టెలికాం ఆపరేటర్లు విలవిలలాడుతున్నారు. ఎయిర్ టెల్ ఇప్పటికే తన కస్టమర్లను లక్షల సంఖ్యలో కోల్పోగా , ఆ జాబితాలోకి ఇప్పుడు వోడాఫోన్ ఐడియా వచ్చి చేరింది. తనకున్న 10.5 మిలియన్ కస్టమర్లలో దాదాపు 50శాతంకు పైగా జియోకు మళ్ళారు. జియో ఏడాది సబ్‌స్క్రిప్షన్ రూ. 1.097 వాల్యూ ఆఫర్ 4Gతో మరింత ఆకర్షణీయంగా ఉండటంతో వినియోగదారులు జియోవైపు ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో మిగతా టెల్కోలకు నిద్ర లేని రాత్రులే మిగిలాయి. సబ్‌స్క్రైబర్స్‌ విషయంలో దేశంలోనే అతి పెద్ద టెలికాం ఆపరేటర్‌ అయిన వోడాఫోన్‌ ఐడియా సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య కాలంలో 20.57మిలియన్ల మంది చందాదారులను కోల్పోగా, భారతి ఎయిర్‌టెల్‌ సెప్టెంబరు నుంచి అక్టోబరు మధ్యలో 4.22 మిలియన్ల మందిని కోల్పోయింది.

Image result for vodafone idea
టెలికాం అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI ) లెక్కల ప్రకారం 7.3 మిలియన్(సుమారు 70 లక్షల మంది )  వోడా ఫోన్ ఐడియా కస్టమర్లు 2018 అక్టోబర్‌లో తమ సబ్‌స్క్రిప్షన్లను వదులుకున్నారు.
సెప్టెంబర్ , అక్టోబర్ లెక్కలను కలుపుకుంటే.. 2018లో దాదాపు 14 మిలియన్ల కస్టమర్లు వోడాఫోన్ ఐడియాను వదిలి ఇతర నెట్‌వర్కులను ఎంచుకున్నారని ట్రాయ్ తెలిపింది. ఇదే సమయంలో రిలయన్స్ జియో  23.5( 23 లక్షల 50 వేలమంది)  మిలియన్ల కస్టమర్లను కొత్తగా చేర్చుకుంది. 
సెప్టెంబర్ నాటికి వోడాఫోన్ ఐడియా  తన యావరేజ్  రెవెన్యూ పర్ మంత్ (ARPU) నెలకు రూ. 88  గా ఉందని పేర్కొంది. అదే రిలయన్స్ జియో ARPU నెలకు రూ. 99 గా ఉండటం గమనార్హం. 

chart

courtesy by: Business standard
ఇప్పటికే ఎయిర్ టెల్ వంటి కంపెనీలు తమ యావరేజ్ రెవెన్యూ పర్ మంత్ ను పెంచుకోడానికి నెలకు కనీస రీఛార్జ్ రూ. 35 ప్లాన్, జీవిత కాల ఫ్రీ ఇన్ కమింగ్ ప్లాన్ రద్దు, వంటి నిర్ణయాలు తీసుకుంది. వోడా ఫోన్ ఐడియా కూడా అదే బాటలో నడవడంతో దాదాపు 1 కోటి 40 లక్షల మంది వినియోగ దారులను అది కోల్పోవాల్సి వచ్చింది. 2018లో వోడా ఫోన్ ఐడియా తన కస్టమర్లను క్రమ క్రమంగా కోల్పోయింది. జూలైలో 0.6 మిలియన్ల కస్టమర్లను పెంచుకోగా, ఆగస్ట్ నాటికి 2.3 మిలియన్ల కస్టమర్లను కోల్పోయింది.  అక్టోబర్ నాటికి 7.4 మిలియన్ల కస్టమర్లు వోడా ఫోన్‌కు గుడ్‌బై చెప్పారు. 
ఇప్పటికైనా మించిపోయిందేం లేదని, వోడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ వంటి కంపెనీలు తమ సేవలతో, నాణ్యమైన టారిఫ్ ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకోవచ్చని, 2019 చివరినాటికి తమ పనితీరును మెరుగు పరుచుకుంటే ఆయా కంపెనీల నష్టాలు పూడ్చుకోవచ్చని టెలికాం మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధాన పోటీ సంస్థ అయిన జియో ప్లాన్లకు ధీటుగా తమ కొత్త ప్లాన్లను ప్రకటించగలిగితే.. వోడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలకు కొత్త వినియోగదారులు పెరుగుతారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 

Image result for traiMost Popular