నిఫ్టీ 8500కి పడిపోయినా సరే.. !! ఇలా చేస్తే లాభాలు వస్తాయ్!

నిఫ్టీ 8500కి పడిపోయినా సరే.. !! ఇలా చేస్తే లాభాలు వస్తాయ్!

1994లో NSE ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటిదాకా .. గత 5 ఏళ్ళుగా ప్రాఫిట్ రిటర్న్స్ అంతగా రాలేదనే చెప్పాలి. కానీ అదే నిఫ్టీలో 10 ఏళ్ళ పెట్టుబడుల మీద దాదాపు 80శాతం వృద్ధితో సాలీనా 10శాతం ప్రాఫిట్ రిటర్న్స్ వచ్చాయి. 1994-2018 వరకూ ఈ 24 ఏళ్లలో వార్షిక ఆదాయం సగటున 10 శాతంకు మించి ఉందనే చెప్పాలి. మరి ఈ 2019 సంవత్సరంలో నిఫ్టీ ఎలా ఉండబోతుంది. ఏ ఏ స్టాక్స్ ప్రాఫిట్ రిటర్న్స్ ఇస్తాయనే దానిపై ఎనలిస్టులు ఒక విశ్లేషణ చేశారు. అందేంటో చూద్దామా..!
గత చరిత్రను ఒక సారి పరిశీలిస్తే.. 2017లో నిఫ్టీ దాదాపు 30శాతం లాభాలను పంచింది. వీటిలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ దే హవాగా ఉంది. కానీ.. 2018 వచ్చేసరికి.. నిఫ్టీలో కాస్త అస్థిరత కనబడింది. గ్లోబల్ మార్కెట్ల పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, రూపీ మారకపు విలువ పతనం వంటివి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాలను తీవ్రంగా నష్టపరిచాయి. 
ఇక ఈ 2019 సంవత్సరంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. సుస్థిర ప్రభుత్వం ఏర్పడితేనే.. మార్కెట్లు స్థిరంగా ఉంటాయన్నది ఎనలిస్టుల భావన. ఎన్నికలకు ముందు నిఫ్టీ 8,500 పాయింట్ల చేరువలో ఉండొచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడి, అమెరికా ఫెడ్  వడ్డీ రేట్లు తగ్గి, క్రూడ్ ఆయిల్ ధరలు దిగివస్తే గనుక.. దేశీయ మార్కెట్లు పుంజుకోవచ్చు. కార్పోరేట్ ఆదాయాలు పెరగొచ్చు. 
కాబట్టి.. ఈ 2019లో మదుపర్లు ఏం చేయ్యాలనే దాని మీద ప్రముఖ ఎనలిస్టులు మూడు మార్గాలను సూచిస్తున్నారు.
1), మార్కెట్ పడిపోతున్న సమయంలో మంచి స్టాక్స్ ను ఎంపిక చేసుకోవడం,.
2), క్రమానుగత పెట్టుబడి (SIP)ని మొదలు పెట్టాలి. ఎందుకంటే.. పతనం తరువాత మార్కెట్లు     పుంజుకుంటాయి కాబట్టి. 
3), సానుకూల ధృక్పథంతో మార్కెట్లలోకి ప్రవేశించండి. రానున్న 10 ఏళ్ళకోసం ఇప్పుడే మీ ఈక్విటీ బ్రోకర్ ద్వారా.. నిఫ్టీ ETFలలో క్రమానుగత పెట్టుబడులను పెట్టండి. 
ఇలా చేస్తే.. నిఫ్టీ 8,500 పాయింట్ల కిందికి పడిపోయినా.. మీ స్టాక్స్ మీద ప్రాఫిట్స్ ఎటూ పోవని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 

Disclaimer: పైన పేర్కొన్న అభిప్రాయాలు, సూచనలు ఎనలిస్టులు చేసినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికకు ముందు మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి. 
   
 

 Most Popular