ఫ్యూచర్‌ రిటైల్‌కు ఈకామర్స్‌ షాక్‌

ఫ్యూచర్‌ రిటైల్‌కు ఈకామర్స్‌ షాక్‌

ఆన్‌లైన్‌ ద్వారా వస్తువులు విక్రయించే ఈకామర్స్‌ బిజినెస్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించడంతో ఫ్యూచర్‌ రిటైల్‌ కౌంటర్‌కు సెగ తగులుతోంది. ఇటీవల ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ఈ కౌంటర్‌ నేలచూపులకే పరిమితమవుతోంది. ఈ బాటలో ప్రస్తుతం ఫ్యూచర్‌ రిటైల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో మరోసారి 4 శాతం పతనమైంది. రూ. 442 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 441 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఇతర వివరాలు చూద్దాం..

Related image

అమెజాన్‌ వెనకడుగు?
గత 8 ట్రేడింగ్‌ సెషన్లలో ఫ్యూచర్‌ రిటైల్‌ కౌంటర్‌ 19 శాతం తిరోగమించింది. డిసెంబర్‌ 24న ఈ షేరు రూ. 564 వద్ద ట్రేడయ్యింది. విభిన్న డిపార్ట్‌మెంటల్‌ స్టోర్ల ద్వారా దేశవ్యాప్తంగా కంపెనీ హౌస్‌హోల్డ్‌, కన్జూమర్‌ ప్రొడక్టులు విక్రయించే సంగతి తెలిసిందే. భారీ డిస్కౌంట్లు, అతి చౌక ధరలను ఆఫర్‌ చేయడం ద్వారా బిజినెస్‌లు పెంచుకునే ఈకామర్స్‌ సంస్థలకు ప్రభుత్వం గత వారం చెక్‌పెట్టింది. దీంతో కంపెనీలో 10 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్న గ్లోబల్‌ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌ వెనకడుగు వేసే అవకాశమున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్‌ మార్గంలో ఫ్యూచర్‌ రిటైల్‌లో రూ. 2,000 కోట్లతో వాటాను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే అమెజాన్‌ ఆసక్తి చూపినట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా.. మారిన నిబంధనల నేపథ్యంలో ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా కొనుగోలు అంశాన్ని అమెజాన్‌ పునఃపరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. Most Popular