2019లో నోరూరించేలా కనబడుతున్న ఈ సెక్టార్లు..!

2019లో నోరూరించేలా కనబడుతున్న ఈ సెక్టార్లు..!

మార్కెట్లో ఒక స్టాక్‌ మీద పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీ అంతర్గత విలువ కంటే తక్కువగా ఆ కంపెనీ స్టాక్ ధర ఉన్నప్పుడు కొనడమే మేలు. దీన్నే కాంట్రారియన్ ఇన్వెస్టింగ్ అంటారు. ఇది నిజంగా పనిచేస్తుందని.. విశ్లేషకులు కూడా ఒప్పుకుంటారు. ఒక రంగంలో పూర్తిగా నిరాశ అలుముకున్నప్పుడు ఆయా స్టాక్స్ ఎంపిక చేసకోడం బుల్స్‌కు కొట్టిన పిండి. 2018లో పూర్తిగా నిరాశ పరిచిన స్టాక్స్ చాలానే ఉన్నాయి. ఫండమెంటల్  పునాది బాగానే ఉన్నా.. మార్కెట్ స్థితిగతులు, అంతర్జాతీయ పరిణామాలు, కాంట్రాక్టుల్లో ముందంజ లేక పోవడం వంటి వాటి వల్ల ఆయా స్టాక్స్ మంచి పనితీరును కనబరచలేక పోయాయి. 

Image result for infra sector
కానీ.. ఈ2019లో మాత్రం కొన్ని స్టాక్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. వీటిలో క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ (రోడ్లు, నిర్మాణ రంగం) , సిమెంట్ రంగాలు ఈ సంవత్సరంలో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. చాలా కాలం తరువాత ప్రైవేట్ క్యాపెక్స్ విషయంలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. వినిమయ సామర్ధ్యం పెరగడంతో ప్రైవేటు క్యాపెక్స్ వేగంగా వృద్ధి చెందుతుంది. ఇదే పాయింట్ ఇంజనీరింగ్, క్యాపిటల్ గూడ్స్ విషయంలో పనిచేస్తుంది. పలు కంపెనీల వద్ద ఉన్న కాంట్రాక్టు ఆర్డర్లు ఈ సంవత్సరం కార్యరూపం దాల్చనున్నాయి కాబట్టి.. సిమెంట్ , ఇనుము, రైల్వేలు, మెట్రో నిర్మాణం,  బిల్డర్ల రంగం వంటివి వేగంగా పుంజుకునే అవకాశం ఉంది. 
ఆటోమేషన్ , పవర్ సెక్టార్లు అత్యంత ప్రభావశీలంగా కనిపిస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం సిమెంట్ పరిశ్రమకు ఏ మాత్రం కలిసిరాలేదు. పెట్ కోక్ ధరల పెరుగుదల,  ఎగుమతులు, సరఫరా వంటి విషయాల్లో సమస్యలు, మితిమీరిన సరఫరా వ్యయాలు, ఫ్యూయల్ ఖర్చులు వంటి అంశాలతో సిమెంట్ రంగం కునారిల్లింది. రానున్న రోజుల్లో పలు నిర్మాణ కాంట్రాక్టులు కార్యరూపం దాలుస్తాయి కాబట్టి.. సిమెంట్ అమ్మకాలు వేగంగా పుంజుకునే అవకాశం ఉందని ఎనలిస్టుల అంచనా.  నిర్మాణ రంగం ఊపందుకుంటే.. సిమెంట్‌కు అధిక గిరాకీ ఏర్పడటం తధ్యం అని బ్రోకరేజ్ సంస్థలు అంటున్నాయి. 

Image result for cement & infra
గత సంవత్సరం నోట్ల రద్దు, GST వంటి అంశాలు కూడా సిమెంట్ డిమాండ్‌ను హరించి వేశాయి. సిమెంట్ రంగానికున్న ప్రధాన కస్టమర్‌ అయిన రియల్టర్లు కూడా.. తమ వ్యాపారంలో మందగమనాన్నే ఎదుర్కొడంతో  సిమెంట్ పరిశ్రమ చల్లారిపోయింది. ప్రస్తుత సంవత్సరంలో ఈ పరిస్థితులను సిమెంట్ రంగం అధిగమించగలదనే బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. పెట్‌ కోక్ ధరల తగ్గుదల , అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుముఖం  వంటి అంశాలు సిమెంట్ పరిశ్రమ పుంజుకోడానికి ఊతంగా మారవచ్చు. GST రేట్లు కూడా.. 28 శాతం స్లాబు నుండి 18శాతం స్లాబులోకి మారితే.. సిమెంట్ కంపెనీల స్టాక్స్ మరింత పుంజుకునే అవకాశం ఉంది. 

Image result for cement & infra
ఇక 2018లో మౌలిక సదుపాయాల రంగం పూర్తిగా పరాజయం పాలైంది. అనేక మంది కాంట్రాక్టర్లు ఈ రంగం నుండి వైదొలిగారు. మంచి ఆర్డర్లు ఉన్నప్పటికీ.. ప్రాజెక్టులకు నిధుల సరఫరా ఆగిపోవడంతో వారు ముందంజ వేయలేక పోయారు. కానీ.. 2019లో సార్వత్రిక ఎన్నికలు రానుండటంతో.. ఇన్ఫ్రా స్ట్రక్చర్ రంగంలో నిర్మాణాలు ఊపందుకోవచ్చు.  రానున్న 2-3 ఏళ్ల కోసం మదుపు చేయాలనుకున్న వారు.. సిమెంట్ , ఇన్ఫ్రా, స్టీల్ రంగాలను పరిశీలించమని బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మరి మీరు .. ఏ స్టాక్‌ను ఎంపిక చేసుకుంటున్నారు? ఈ కొత్త సంవత్సరంలో...!!

Image result for cement steel infra

Disclaimer: పైన పేర్కొన్న అభిప్రాయాలు, సూచనలు ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థల నిపుణులు చేసినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక విషయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.