5 కెమెరాలు, ఆండ్రాయిడ్ 9... నోకియా 9 ప్యూర్‌వ్యూ

5 కెమెరాలు, ఆండ్రాయిడ్ 9... నోకియా 9 ప్యూర్‌వ్యూ

ఎన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు వచ్చినా, మొబైల్ ఫోన్ అనగానే మొదటగా నోకియా అనే బ్రాండ్ గుర్తు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ స్మార్ట్‌ఫోన్ విస్తరణను ముందుగా అంచనా వేయడంలో విఫలమైన నోకియా, ఇతర కంపెనీల పోటీని తట్టుకోలేకపోయింది.

అయితే, నోకియా నుంచి వచ్చే ఫోన్‌ల మన్నిక విషయంలో జనాలకు ఓ నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. అందుకే ఇప్పటికీ కొత్త ఫోన్ వస్తోందంటే ఆసక్తి బాగానే పెరుగుతుంది. ఇప్పుడు హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ రిలీజ్ చేయబోతున్న నోకియా 9 ప్యూర్‌వ్యూ విషయంలో అదే జరుగుతోంది. గత కొన్ని వారాలుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ గురించి, టెక్ లవర్స్‌లో చాలానే చర్చలు జరుగుతున్నాయి.

 

కెమేరానే స్పెషల్

సింగిల్ కెమేరాల నుంచి డ్యుయెల్ కెమేరాల వరకు ఇప్పుడు అనేక మొబైల్ మేకింగ్ కంపెనీలు అప్‌గ్రేడ్ అయ్యాయి. కానీ, ఏకంగా 7 కెమేరాలతో నోకియా 9 రాబోతోందనే మాట కొంతకాలంగా వినిపిస్తోంది. వెనుక వైపు 5 కెమేరాలు, ముందు వైపు 2 కెమేరాలు ఉంటాయని అంటున్నారు.

ఇప్పుడు నోకియా 9 విషయం చాలావరకు స్పష్టత వచ్చేసింది. ప్రస్తుతం నోకియా 9కు సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియో ఆన్‌లైన్‌లో ట్రెండింగ్ అవుతోంది. దీనిలో నోకియా 9 ప్యూర్‌వ్యూకు సంబంధించిన దాదాపు అన్ని ఫీచర్స్‌పై డీటైల్స్ అందుబాటులో ఉన్నాయి.

 

ఇంకా అనౌన్స్ చేయకుండానే

ఈ నెలలోనే బార్సిలోనాలో జరగబోతున్న స్మార్ట్‌ఫోన్ ఎగ్జిబిషన్ ఈవెంట్ అయిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో నోకియా 9 ప్యూర్‌వ్యూ ను ప్రదర్శించబోతున్నారనే అంచనాలు ఉన్నాయి. దీనికి ముందుగానే, టెక్ పబ్లికేషన్ కంపెనీ అయిన మైస్మార్ట్‌ప్రైస్, ఈ అప్‌కమింగ్ డివైజ్‌కు సంబంధించిన ఓ వీడియోను డిస్‌ప్లే చేస్తోంది.

నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో, నోకియాకు చెందిన ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ చాలానే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. గ్లాస్ బ్యాక్‌తో మెటల్ ఫ్రేమ్ డిజైన్ ఉండడమే కాదు, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది.

నోకియా 8 సిరోకో మాదిరిగానే స్క్రీన్‌కు పై, కింది భాగాలు కనిపిస్తున్నాయి. 5.99 అంగుళాల ఎడ్జ్-టు-ఎడ్జ్ క్యూహెచ్‌డీ ప్యూర్ డిస్‌ప్లే స్క్రీన్... హెచ్‌డీఆర్ కేపబిలిటీతో 2కే రిజొల్యూషన్ కలిగి ఉంటుంది. స్క్రీన్‌లోనే ఇన్-బిల్ట్‌గా ఫింగర్‌ప్రింట్ సెన్సర్ అమర్చడం, నోకియాకు ఇదే మొదటిసారి కావడం విశేషం.

 

5 కెమేరాలతో ఆకట్టుకునే డిజైన్

వెనుక వైపు 5 కెమేరాలు ఉండడం మాత్రం ఖాయమేననే సంగతి ఈ వీడియోతో స్పష్టం అయిపోతోంది. మరో రెండు స్లాట్స్ కూడా కెమేరాల మాదిరిగానే కనిపిస్తున్నా... ఒకటి ఫ్లాష్ కాగా, మరొక స్లాట్ ఎందుకో ఇంకా తేలలేదు. Zeiss లెన్స్‌తో మధ్యలో 1 కెమేరా, చుట్టూ వృత్తాకారంలో 6 స్లాట్స్‌ను అమర్చిన డిజైన్ అయితే, అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది.

తక్కువ కాంతి ఉన్న సమయాల్లో కూడా 10 రెట్లు ఎక్కువ స్పష్టతతో ఫోటోలను తీయగలిగేందుకు వీలుగా 5 సెన్సర్లను నోకియా జోడించింది. హెచ్‌డీఆర్ టెక్నాలజీలో ఇదో వినూత్నమైన గాడ్జెట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

నోకియా 9 ప్యూర్‌వ్యూ స్మార్ట్‌ఫోన్‌తో లభించే కెమేరాకు గల మరొక అధునాత ఫీచర్ ఏంటంటే, ఇమేజ్‌ను క్లిక్ చేసిన తర్వాత కూడా ఫోకస్‌ను అడ్జస్ట్ చేసుకోగలగడం. దీనికి అదనంగా గూగుల్ లెన్స్ యాప్ ద్వారా ఇమేజ్ సెర్చింగ్ కూడా చేయవచ్చు. దీనిని కెమేరా యాప్‌తో జోడించడం మరో అట్రాక్టింగ్ ఫీచర్‌గా చెప్పవచ్చు.

 

ఇవీ ఫీచర్స్

ఆక్టాకోర్ స్మాప్‌డ్రాగన్ 545 ఎస్ఓసీ చిప్‌సెట్‌, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌లతో నోకియా 9 ప్యూర్‌వ్యూ అందుబాటులో రానుంది. అయితే ర్యామ్, స్టోరేజ్ విషయంలో మాత్రం మరికొన్ని ఆప్షన్స్ ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.

ఆండ్రాయిడ్ 9.0 పై... ఆపరేటింగ్ సిస్టంతో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు... రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందించబోతున్నట్లు నోకియా ప్రామిస్ చేస్తోంది.

మరిన్ని డీటైల్స్ కోసం ఈ వీడియోను ఓసారి చూసేయండి.

https://www.youtube.com/watch?v=XGZY-JA-vw0Most Popular