జావా  దెబ్బకు రాయల్ ఎన్‌ఫీల్డ్ పంక్చర్..! 14% సేల్స్ డ్రాప్

జావా  దెబ్బకు రాయల్ ఎన్‌ఫీల్డ్ పంక్చర్..! 14% సేల్స్ డ్రాప్

దేశీయంగా విలాసవంత బైకింగ్‌కు మారు పేరైన రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 2018లో కుంటుపడ్డాయి. చెన్నై ప్లాంట్‌లో కార్మికుల సమ్మె,  పోటీ సంస్థ అయిన జావా బైక్ బుక్కింగుల వెల్లువతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ల అమ్మకాల్లో వెనుక బడ్డాయి. ఐషర్ మోటార్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అమ్మకాల్లో 2018లో 14శాతం నష్టపోయింది. ఇది 2011 జూన్ తరువాత ఇదే అత్యంత గరిష్ట నష్టం అని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 2017 లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 65,367 యూనిట్లు కాగా, 2018 వచ్చేసరికి ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 56,026కు పరిమితమయ్యాయి. 

Image result for java bikes newImage result for royal enfield bikes
దూసుకొచ్చిన మహీంద్ర&మహీంద్ర జావా బైకులు
గతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన జావా బైకులను రీ మోడల్ చేసి మహీంద్ర కంపెనీ రెండు కొత్త 350 cc బైకులను మార్కెట్లలో ప్రవేశ పెట్టడంతో వినియోగ దారుల దృష్టి అటువైపు మళ్ళింది. ఆకట్టుకునే రూపం, సరసమైన ధరల్లో జావా మోడళ్ళు ఆకర్షించేసరికి .. వాటి బుక్కింగులు, ఆర్డర్లు వెల్లువెత్తాయి 2018లో. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల్లో క్షీణత మొదలైంది.  జావా బుక్కింగులు ఎలా ఉన్నాయంటే.. మహీంద్రా కంపెనీ.. ఆర్డర్లు తీసుకోడం మానేసేంత పెరిగిపోయాయి. ప్రస్తుతం బుక్కైన బైకుల డెలివరీకే.. 2019 మార్చ్ వరకూ పట్టొచ్చని.. డిమాండ్ కు తగ్గ సరఫరా చేయలేక పోతున్నామని మధ్య ప్రదేశ్ లోని మహీంద్ర ప్లాంట్ వర్గాలు తెలిపాయి. గత 8 ఏళ్ళలో ఇలా ఒక బైక్ ఉత్పత్తి సంస్థ డిమాండ్ తట్టుకోలేక ఆర్డర్లు తీసుకోవడం నిలిపివేయడం ఇదే తొలి సారి అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. జావా మోడళ్ళకు అంత గిరాకీ ఏర్పడింది.

 Image result for java bikes new
1960,70 ల్లో ఒక ఊపు ఊపిన జావా, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్స్‌నే కాస్త అటు ఇటుగా మార్చి ప్రస్తుతం అమ్ముతున్నారు రెండు కంపెనీల వారు. రెట్రో స్టైలింగ్, DNA మోడల్స్ తో  సింగిల్ సిలెండర్ , 300 cc ఇంజిన్ , 27 hp (హార్స్ పవర్ ) వంటి ఫీచర్లే ఈ రెండు కంపెనీల బైకులకు ఉన్నాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ ధర 1.4 లక్షలు కాగా, జావా 42 ధర రూ. 1.55 లక్షలుగా ఉంది. కానీ.. అమ్మకాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్షీణతను నమోదు చేయడం గమనార్హం. 
2018లో మోటార్ వాహనాల రంగం 21శాతం వృద్ధిని నమోదు చేస్తే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రం కేవలం 6శాతం వృద్ధిని నమోదు చేసింది. తన ఉత్పత్తుల్లో అత్యంత ఆదరణ కలిగిన క్లాసిక్ 350 మోడల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అంతే కాకుండా తన కొత్త మోడల్స్ అయిన హిమాలయన్, కాంటినెంటల్ GT 500 అమ్మకాలు కూడా వేగంగా పడిపోయాయి. దీంతో ఈ 2018 సంవత్సరం రాయల్ ఎన్‌ఫీల్డ్ కు కలిసి రాలేదనే చెప్పొచ్చు. అంతే కాకుండా తన కొత్త మోడల్స్ అయిన ఇంటర్ సెప్టార్, కాంటినెంటల్ GT  బైకుల ధరలు వచ్చేసి రూ. 2.5 లక్షల పైబడే ఉండటంతో వినియోగదారులు కొనుగోళ్ళకు ఆసక్తి చూపలేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతే కాకుండా 2018 సెప్టెంబర్ అక్టోబర్ మధ్య కాలంలో తన చెన్నై ప్లాంట్‌లో జరిగిన సమ్మె కారణంగా దాదాపు 30,000 యూనిట్ల ఉత్పత్తి ఆగిపోవడం కూడా కంపెనీకి పెద్ద దెబ్బలా మారింది.  

Image result for royal enfield bikesImage result for royal enfield bikes
 Most Popular